- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

తెలంగాణ లోని గ్రేట‌ర్ హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న జూబ్లిహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రుగుతున్న ఉప ఎన్నిక ఇప్పుడు తెలంగాణ రాజ‌కీయాల్లోనే కాకుండా .. రెండు తెలుగు రాష్ట్రాల రాజ‌కీయాల్లోనూ ఆస‌క్తి గా మారింది. ఇక్క‌డ నుంచి గ‌త మూడు ఎన్నిక‌ల్లోనూ వ‌రుస విజ‌యాలు సాధిస్తూ హ్యాట్రిక్ కొట్టిన మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో మృతి చెంద‌డంతో ఇక్క‌డ ఉప ఎన్నిక అనివార్య‌మైంది. ఇక ప్ర‌ధాన పార్టీలు మూడు కూడా త‌మ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఇప్ప‌టికే ప్ర‌క‌టించేశాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి న‌వీన్ యాద‌వ్ - బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసిన ఓడిపోయిన లంకాల దీప‌క్ రెడ్డి మ‌రోసారి పోటీ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ నుంచి అదిరిపోయే ట్విస్ట్ చోటు చేసుకుంది.


మాగంటి సునీత ఇప్ప‌టికే బీఆర్ ఎస్ నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేయ‌గా.. ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి సైతం ఈ రోజు నామినేష‌న్ దాఖ‌లు చేశారు. దివంగ‌త మాజీ మంత్రి పీజేఆర్ రాజ‌కీయ వార‌సుడు అయిన విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డి గ‌త ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ సీటు రాక‌పోవ‌డంతో బీఆర్ ఎస్ కండువా క‌ప్పుకున్నారు. మ‌రి ఇప్పుడు సునీత బీఆర్ ఎస్ నుంచి నామినేష‌న్ వేసినా కూడా .. ఇప్పుడు విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డి ఎందుకు ?  నామినేష‌న్ వేయ‌లేదు ? అన్న‌ది ఎవ్వ‌రికి అర్థం కాని ప‌రిస్థితి. అయితే సునీత నామినేష‌న్ లో త‌ప్పులు దొర్లి రిజెక్ట్ అయితే బీఆర్ ఎస్ నుంచి విష్ణు వ‌ర్థ‌న్ రెడ్డి పోటీలో ఉంటార‌ని అంటున్నారు. ఇదంతా కేసీఆర్ , కేటీఆర్ వ్యూహంలో భాగంగా అని చ‌ర్చించుకుంటున్నారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: