
ఈ క్రమంలో తనపై ఎన్నో విమర్శలు, ట్రోలింగ్ వచ్చాయని ఆమె పేర్కొన్నారు. అయినప్పటికీ, తాను తన రియల్ లైఫ్‌ను, అనుభవాలను పంచుకోవడానికి ఏ మాత్రం వెనుకాడలేదని సమంత ధైర్యంగా చెప్పారు.
"నేనేమీ పర్ఫెక్ట్ కాదు. నేను కూడా తప్పులు చేయవచ్చు, తడబడవచ్చు. కానీ ప్రస్తుతం నేను మెరుగ్గా ఉండటానికి ప్రయత్నిస్తున్నాను. నిజాయితీ అనేది గమ్యం కాదు, అది నిరంతర కృషి," అని సమంత వ్యాఖ్యానించారు. బహిరంగంగా ఉండడం వలన ఎన్నో విమర్శలు ఎదురైనప్పటికీ, తన నిజ జీవితాన్ని పంచుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని, జీవితంలో ప్రతిదీ సరిగ్గా లేనప్పటికీ, ఆ విషయాన్ని ధైర్యంగా చెప్పగలనని ఆమె తెలిపారు.
సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. వ్యక్తిగత జీవితంలో ఎదురైన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటూ, వాటిని బహిరంగంగా పంచుకుంటున్న ఆమె తీరుపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. సమంత కెరీర్ పరంగా బిజీగా ఉండాలని అభిమానులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు