- ( ఉత్త‌రాంధ్ర ప్ర‌త్యేక ప్ర‌తినిధి - ఇండియా హెరాల్డ్ ) . . .

శ్రీకాకుళం జిల్లాలోని పలాస నియోజకవర్గం లోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోటు చేసుకున్న తొక్కలాటపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఓ భక్తుడు నిర్మించిన ఆలయానికి వేలాదిగా భక్తులు రావడం ఆ తర్వాత జరగడంతో ఈ సంఘటన జరిగిందని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ ప్ర‌మాదంలో ఇప్ప‌టికే 10 మంది వ‌ర‌కు మృతి చెంద‌గా .. ప‌లువురు అప‌స్మార‌క స్థితిలో ఉండి ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. సంఘటన సమాచారం తెలుసుకున్న వెంటనే జిల్లా మంత్రి అచ్చం నాయుడు , స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష , విజయనగరం జిల్లాకు చెందిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెంటనే ప్రమాద స్థలికి చేరుకున్నారు. వీరి కంటే ముందుగానే అక్కడికి వచ్చిన వైసీపీ నేత మాజీ మంత్రి శ్రీదేవి అప్పలరాజు సమయస్ఫూర్తితో వ్యవహరించారన్న ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.


వృత్తిరీత్యా డాక్టర్ అయిన అప్పలరాజు కాశీబుగ్గ ఆలయంలో ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం తెలుసుకొని అక్కడకు చేరుకున్నారు. ఆలయానికి అప్పలరాజు ఇంటికి సుమారు 500 మీటర్ల నుంచి కిలోమీటరు దూరం ఉంటుందని అంటున్నారు. విషయం తెలిసిన వెంటనే అక్కడికి చేరుకున్న అప్పలరాజు తన వృత్తి ధర్మాన్ని నిర్వర్తించారు. డాక్టర్ గా మారి తొక్కిస‌లాట లో ఊపిరి ఆడకుండా ఇబ్బందిపడుతున్న క్షతగాత్రులకు సిపిఆర్ చేశారు. ఆయనను చూసి అక్కడ ఉన్నవారి సైతం సీపీఆర్ చేయడంతో పలువురు శ్వాస తీసుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలా స్వతహాగా డాక్టర్ అయిన అప్పలరాజు ఇలా చొరవ తీసుకొని అక్కడ అపస్మార్క స్థితిలో ఉన్న వారికి వైద్యం చేయడంతో సర్వత్ర ప్రశంసలు వ్యక్తం అవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: