ఎన్నికలు మరో ఎనిమిది నెలలు పైదాటి ఉన్నాయి. కానీ ఏపీలో రాజకీయం చూస్తే అలా ఇలా లేదు. రేపో మాపో ఎన్నికలు అన్నట్లుగా పరిస్తితి వుంది. ఓ వైపు టీడీపీ అభ్యర్ధులను ముందుగా ప్రకటిస్తామని చెబుతూంటే పాదయాత్రలో జగన్ కూడా క్యాండిడేట్లను డిసైడ్ చేసే పనిలో ఉన్నారు. మెజారిటీ సీట్లపై అధినేత ఓ క్లారిటీతో ఉన్నారని టాక్.
అంచనాకు వచ్చారా :
విశాఖ జిల్లలో జగన్ పాదయాత్ర ఈ నెల 22తో ముగుస్తోంది. మొత్తం పదిహేను అసెంబ్లీ సీట్లలో డజన్ వరకూ పాదయాత్ర ద్వారా కవర్ చేసిన జగన్ ఎమ్మెల్యే క్యాండిడేట్లపై కూడా ఓ అంచనాకు వచ్చారని అంటున్నారు. రావాలి జగన్, కావాలి జగన్ ప్రోగ్రాం కి ముందు ఆయన కొంతమంది ఇంచార్జ్ లను మార్చారు. దాంతో కొత్తగా వచ్చిన వారే ఎమ్మెల్యే క్యాండిడేట్ అవుతారని టాక్ నడుస్తోంది.
లిస్ట్ ఇదేనా :
ఆ విధంగా చూసుకుంటే విశాఖ దక్షిణం నుంచి డాక్టర్ రమణమూర్తి, తూర్పు నుంచి వంశీ క్రిష్ణ శ్రీనివాస్, ఉత్తరం నుంచి కె కె రాజు, పశ్చిమం నుంచి మళ్ళ విజయప్రసాద్, గాజువాక నుంచి తిప్పల చిన అప్పారావు, పెందుర్తి నుంచి చొక్కాకుల వెంకటరావు , అనకాపల్లి నుంచి గుడివాడ అమర్ నాధ్, ఎలమంచిలి నుంచి కన్నబాబు రాజు, మాడుగుల బూడి ముత్యాలనాయుడు, చోడవరం నుంచి కరణం ధర్మశ్రీ దాదాపుగా ఖరార్ అయినట్లేనని అంటున్నారు. పెండింగులో పెండింగులో ఇద్దరు మంత్రుల సీట్లూ ఉన్నాయి. భీమునిపట్నం నుంచి కూడా గట్టి క్యాండిడేట్ ని దించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. నర్శీపట్నం నుంచి చూస్తే ఇక్కడ ఇంచార్జ్ పెట్ల ఉమాశంకర్ తో పాటు, మాజీ ఎమ్మెల్యే ముత్యాల పాప కూడా రేసులో ఉన్నారు.