అదృష్టవశాత్తు ముంబై కారణంగా ప్లే ఆఫ్ లో అవకాశం దక్కించుకున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇటీవలే మొదటి ఎలిమినేటర్ మ్యాచ్  లో గెలిచింది. ఒకానొక సమయంలో కీలక బ్యాట్స్మెన్ లు మొత్తం చేతులెత్తేయడంతో ఇక బెంగుళూరు పరాజయం ఖాయమని అందరు అనుకున్నారూ. అలాంటి సమయంలో అన్ క్యాప్డ్ ప్లేయర్ రజాత్ అదరగొట్టేశాడు. ఏకంగా సెంచరీతో చెలరేగాడు. కేవలం 49 బంతుల్లోనే సెంచరీ సాధించి అదరగొట్టాడు.  మొత్తంగా 54 బంతుల్లో 112 పరుగులు చేశాడు. ఒకవేళ అతను ఆడక పోయుంటే అటు బెంగళూరు జట్టు విజయం సాధించడం మాత్రం ఎంతో కష్టం అని చెప్పాలి.



 ఇలా బెంగళూరు జట్టు గెలిచి ముందుకు సాగుతుంది అంటే కేవలం ఆ యువ ఆటగాడు కే దక్కుతుంది మొత్తం క్రెడిట్. కాగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ రజాత్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. తాను చూసిన అత్యుత్తమ ఇన్నింగ్సుల్లో రజాత్ ఇన్నింగ్స్ కూడా ఒకటి అంటూ కొనియాడాడు  ఒత్తిడిలో కూడా యువ ఆటగాడు అద్భుతంగా రాణించి ప్రత్యర్థికి చుక్కలు చూపిస్తూ బ్యాటింగ్ చేసే విధానం ఎంత గొప్పగా ఉంది అంటూ ప్రశంసలు కురిపించాడు. లక్నో తో జరిగిన  మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో విజయం సాధించింది బెంగళూరు జట్టు.


 రాజస్థాన్ రాయల్స్ తో రెండవ క్వాలిఫైర్ మ్యాచ్ ఆడబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే విజయం అనంతరం కోహ్లీ రజాత్ తో ముచ్చటిస్తూ సరదా సంభాషణ చేశాడు. నా సుదీర్ఘ కెరీర్లో  నేను చూసిన చాలా గొప్ప ఇన్నింగ్స్ ఇది. మా స్వరూపాన్ని మార్చే గల ఆట చూశాను.. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించినా ఆటగాళ్లను చూశాను.. మ్యాచ్ లోనూ ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్.. తీవ్ర ఒత్తిడికి అయినా కూడా ప్లే ఆఫ్ చరిత్రలో సెంచరీ సాధించిన మొదటి అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రజాత్ నిలిచాడు అంటు ప్రశంసించాడు విరాట్ కోహ్లీ..

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl