సాధారణంగా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో మైదానంలో ఆటగాళ్లు సిక్సర్లు ఫోర్లతో చెలరేగిపోతు ఉంటారు. ఇక బౌలర్లు వికెట్ తీయడమే లక్ష్యంగా అద్భుతమైన బంతులను సందిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే మైదానంలో జరిగే మ్యాచ్ ఎప్పుడు సాదాసీదాగానే ఉంటుంది. కానీ ఆ మ్యాచ్ లను ఎంతో ఉత్కంఠ భరితంగా మార్చేది మాత్రం కేవలం కామెంటేటర్ లు మాత్రమే అని చెప్పాలి. ఇక ప్రతి బంతికి తగ్గట్లుగా తమ కామెంటరీ ఇస్తూ వేగంగా మ్యాచ్ మరింత రంజుగా మారీ పోయే విధంగా క్రికెట్ ప్రేక్షకుల్లో ఉత్కంఠ పెరిగే విధంగా ఎంతోమంది కామెంట్రీ తో అదరగొడుతు ఉంటారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా ఇప్పటివరకు కామెంట్రీ ప్యానల్ లో కొనసాగుతూ తమ కామెంట్రీ తో అదరగొట్టి మ్యాచ్ లను ఉత్కంఠభరితంగా మార్చిన వారు  చాలా మంది ఉన్నారు. ఇలాంటి వారిలో ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ ఛాపెల్ కూడా ఒకరు. ఆస్ట్రేలియా జట్టుకు సుదీర్ఘమైన సేవలు అందించిన ఆయన ఇక అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రం కామెంటేటర్ గా అవతారమెత్తారు. ఇక ఎన్నో ఏళ్ల జర్నీ తర్వాత ఇక ఇప్పుడు తన కామెంటరీ కెరీర్ లు రిటైర్మెంట్ ప్రకటించారు అని చెప్పాలి. ఇకపై తాను వ్యాఖ్యాతగా వ్యవహరించబోను అంటూ ప్రకటించారు. ఆరోగ్యపరమైన కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు  వెల్లడించారు.



 కాగా ఇయాన్ ఛాపెల్ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన తరువాత ప్రతిష్టాత్మక ఛానల్ 9 ద్వారా  కామెంట్రీ మొదలు పెట్టారు. తన అద్భుత వ్యాఖ్యానంతో క్రికెట్ ప్రపంచం పై ప్రత్యేకమైన ముద్ర వేసారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సునిశిత విశ్లేషణలతో ఎంతోమంది ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. ఇలా అత్యుత్తమ కామెంటేటర్ గా ఎదిగి నలభై ఏళ్ల పాటు జర్ని కొనసాగించారు. ఇక ఒక ఆటగాడిగా ఇయాన్ ఛాపెల్ కెరియర్ చూసుకుంటే.. ఆస్ట్రేలియా తరపున 75 టెస్టులు ఆడి 5345 పరుగులు చేశాడు. ఇందులో 30 మ్యాచ్లలో కెప్టెన్గా వ్యవహరించాడు. పదహారు వన్డేలకు కూడా ఆయన ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: