ప్రస్తుతం వర్షాకాలం మొదలైంది. దీంతో దేశవ్యాప్తంగా మొన్నటివరకూ చిరుజల్లులు పడ్డాయి. కానీ ఇప్పుడు ఆ చిరుజల్లులు కాస్త భారీ వర్షాలు గా మారిపోయాయి. దీంతో ఎన్నో రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా వరదలు వస్తున్న పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా రాష్ట్రాలలో వర్షాల కారణంగా ఆరెంజ్, రెడ్ అలర్ట్ కూడా జారీ చేస్తున్న పరిస్థితి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే అక్కడ ఇక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట దంచి కొడుతుంది  వర్షం. దీంతో వాగులు కుంటలు నిండిపోయాయ్. ఇక వరదలు పోటెత్తుతున్నాయి అనే చెప్పాలి.


 ఇక భారీగా వస్తున్న వరద కారణంగా ఎన్నో రహదారులు కూడా జలదిగ్బంధంలో  మునిగిపోయిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాదు ఇక దేశంలోని ఎన్నో రాష్ట్రాలు చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో వెళ్లిపోయి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు అని చెప్పాలి. ఇక వరదలు ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నాయ్ అన్నదానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్  చేస్తూనే ఉన్నాయి. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత అవాక్కవడం ప్రతి ఒక్కరి వంతు అవుతుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.


 ఏకంగా చూస్తూ చూస్తుండగానే బియ్యం లోడుతో ఉన్న ఒక పెద్ద లారీ వరదల్లో కొట్టుకుపోయింది. ఈ ఘటన చత్తీస్ గడ్ లో వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజాపూర్ లోని మెట్టు పల్లి గ్రామంలో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ వరదల్లో కొట్టుకుపోయింది. అయితే డ్రైవర్ చాకచక్యంగా సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డాడు అన్నది తెలుస్తుంది. భారీ వరదల నేపథ్యంలో కళ్లముందే లారీ కొట్టుకుపోతుంటే  చూస్తూ ఉండడం తప్ప అక్కడున్న జనాలు కూడా ఏం చేయలేకపోయారు. ఇక ఇలా వరదలో కొట్టుకుపోయిన లారిలో రెండు వందల కిలోల బియ్యం సహా పంచదార నిత్యావసర సరుకులను గ్రామానికి తీసుకువస్తున్నట్లు డ్రైవర్ చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: