అవును.. నిజంగానే కార్లపై లక్షల్లో డిస్కౌంట్ ఉంది. కొనాలి అనుకునే వారు ఇప్పుడే కొంటె ఎంతో లాభం.. అయితే మరో నెలలో బీఎస్4 వాహనాల నిలిపివేత జరుగుతుంది. ఆటో సంస్థలన్నీ తమ కార్లు, బైక్స్ ను బీఎస్6 ఫార్మాట్లోకి మారుస్తున్నాయి. అందుకే ఉన్న పాత బీఎస్ వాహనాలు అన్ని కూడా అమ్మేయాలని నిర్ణయించుకుంది. అందుకే టాప్ రేటెడ్ కంపెనీలు అన్ని కూడా భారీ డిస్కౌంట్లు ప్రకటించాయి. 

 

టాటా, హ్యుండాయ్, హోండా లాంటి దిగ్గజ సంస్థలు తమ వాహనాలపై అతి భారీగా డిస్కౌంట్లు ప్రకటించాయి. ఒక్కో సంస్థ లక్షల రూపాయల వరకు తగ్గించాయి. ఈ నేపథ్యంలో మరికొన్ని కార్ల కంపెనీలు కూడా తమ వాహనాలపై భారీ డిస్కౌంట్లు ఇచ్చాయి. అయితే ఆ అద్భుతమైన డిస్కౌంట్లు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

​హోండా సీఆర్-వీ..

 

ఈ కారు ప్రారంభ ధర రూ.28.34 లక్షలు.. ఈ కారుపై డిస్కౌంట్ 5 లక్షల రూపాయల వరుకు ఇచ్చింది. 

 

​మహీంద్రా అల్తూరస్..

 

మహీంద్రా అల్తూరస్ ప్రారంభ ధర 27.7 లక్షల రూపాయలు.. ఈ కారుపై గరిష్ఠంగా 2.9 లక్షల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది.

 

​వోక్స్ వాగెన్ వెంటో డీజిల్..

 

​వోక్స్ వాగెన్ వెంటో డీజిల్ ప్రారంభ ధర రూ.8.81 లక్షలు.. ఈ కారుపై ఆ సంస్ద 2.5 లక్షల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది. 

 

​ఇసుజూ ఎంయూ-ఎక్స్..

 

​ఇసుజూ ఎంయూ-ఎక్స్ ప్రారంభ ధర రూ. 27.31 లక్షలు.. ఈ కారుపై ఆ సంస్థ గరిష్ఠంగా 2.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంటు ప్రకటించింది. 

 

​రెనాల్ట్ క్యాప్టర్...

 

​రెనాల్ట్ క్యాప్టర్ ఈ కారు ప్రారంభ ధర రూ.9.5 లక్షలు.. అయితే ఈ కారుపై ఆ సంస్థ గరిష్ఠంగా 2.3 లక్షల రూపాయల వరకు డిస్కౌంటు ప్రకటించింది.

 

​ఇసుజూ వీ-క్రాస్..

 

​ఇసుజూ వీ-క్రాస్ ఈ కారు ప్రారంభ ధర రూ. 16.5 లక్షలు. ఈ వాహనంపై ఆ సంస్థ గరిష్ఠంగా రూ.2.25 లక్షల రూపాయల డిస్కౌంటు ప్రకటించింది.  

 

​వోక్స్ వాగెన్ పోలో డీజిల్..

 

​వోక్స్ వాగెన్ పోలో డీజిల్ ఈ కారు ప్రారంభ ధర రూ.5.87 లక్షలు. అయితే ఈ వాహనంపై ఆ సంస్ద దాదాపు రూ.2.07 లక్షల రూపాయల వరుకు డిస్కౌంటు ప్రకటించింది.  

 

​స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ ఆటోమేటిక్..

 

​స్కోడా ర్యాపిడ్ పెట్రోల్ ఆటోమేటిక్ ఈ కారు ప్రారంభ ధర రూ.8.81 లక్షలు. అయితే ఈ వాహనంపై ఆ సంస్ద 2 లక్షల రూపాయల వరకు డిస్కౌంటు ప్రకటించింది. 

 

జీప్ కంపాస్..

 

జీప్ కంపాస్ ఈ కారు ప్రారంభ ధర రూ.15.65 లక్షలు. ఇక ఈ కారుపై ఆ సంస్థ గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంటు ప్రకటించింది. 

 

​​రెనాల్ట్ క్విడ్..

 

​​రెనాల్ట్ క్విడ్ ఈ కారు ప్రారంభ ధర రూ.3.02 లక్షలు. ఇక ఈ కారుపై ఆ సంస్థ గరిష్ఠంగా 1.5 లక్షల రూపాయల వరకు డిస్కౌంటు ప్రకటించింది. 

 

ఇంట్లో డబ్బు లేకపోయినా.. బయట ప్రజల ముందు స్టైల్ కొట్టాలి అనుకునే కొందరు ప్రజలకు ఈ వాహనాలు ప్రస్తుతం భారీ డిస్కౌంట్లు అందిస్తున్నాయి. కావాలి అనుకునేవారు వెంటనే కోనేయండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: