అమెరికాలో పికప్ ట్రక్కులకు అధిక డిమాండ్ ఉంది. యుఎస్‌లోని చాలా కంపెనీలు పికప్ ట్రక్కులను ఉత్పత్తి చేస్తున్నాయి. అయితే ఫోర్డ్ రామ్ [RAM] శక్తివంతమైన పికప్ ట్రక్కుల తయారీదారులలో ఉన్నారు. రామ్ కొద్ది రోజుల క్రితం తన అత్యంత శక్తివంతమైన టిఆర్ఎక్స్ పికప్ ట్రక్కును యుఎస్ లో లాంచ్ చేసింది. ట్రక్ ప్రారంభించిన గంటల్లోనే 702 యూనిట్లను విక్రయించిందన్నారు. టిఆర్‌ఎక్స్ ట్రక్ కేవలం మూడు గంటల్లో 702 యూనిట్లను విక్రయించిందని కంపెనీ ఒక అధికారిక ప్రకటనలో తెలియజేశారు.


అంతేకాకుండా రామ్ టిఆర్ఎక్స్ పికప్ ట్రక్ రెండు మోడళ్లలో విడుదలైంది. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ ధరలు ఎక్స్-షోరూమ్‌ని బట్టి $ 90,000 నుండి $100,000 వరకు ఉంటాయి. అధిక ధర ఉన్నప్పటికీ వినియోగదారులు ఈ కొత్త ట్రక్కులను కొనడానికి ఇంకా ఎక్కువ ఆసక్తి కనపరుస్తున్నారు.ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పికప్ ట్రక్ అని రామ్ కంపెనీ పేర్కొంది. ఈ ట్రక్కులో డాడ్జ్ ఛాలెంజర్ 6.2-లీటర్ వి 8 ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 692 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుందని తెలిపారు.


ఇక టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్కును పరిమిత సంఖ్యలో తయారు చేసి విక్రయిస్తారు. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ ఏ రహదారిలోనైనా సజావుగా నడుస్తుందని రామ్ కంపెనీ పేర్కొంది. ర్యామ్ ట్రక్కులోని శక్తివంతమైన ఇంజిన్ అన్ని రకాల వాతావరణాలకు అనుకూలంగా ఉంటుంది. బలంగా ఉండటమే కాదు ఈ ట్రక్ వేగంగా కదులుతుందన్నారు. ట్రక్ గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో కదులుతుంది.


అయితే ట్రక్కులో 35-అంగుళాల టైర్స్ అమర్చబడి, ట్రక్కు అన్ని రకాల రోడ్లపై ప్రయాణించడానికి వీలుగా ఉంటుందని నిపుణులు వెల్లడించారు. అయితే టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ 11.8 అంగుళాల గ్రౌండ్ క్లియరెన్స్‌తో మంచి బ్యాలెన్స్ కలిగి ఉంది. ట్రక్ మంచి పనితీరు, పికప్‌లను కూడా అందిస్తుంది. టిఆర్‌ఎక్స్ పికప్ ట్రక్ కేవలం 4.5 సెకన్లలో గంటకు 100 కిమీ వేగవంతం చేస్తుందని నిపుణులు వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: