ప్రతీ ఒక్క కుటుంబం కూడా పిల్లల చదువు కోసం కానీ లేదంటే పెళ్లిళ్ల కోసం డబ్బులు దాయాలని అనుకుంటారు. కానీ ఒక్కోసారి అవి బాగా ఖర్చు అయ్యిపోతు ఉంటాయి.ఇక దీనితో ఆ సమయం వచ్చినప్పుడు బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆడ పిల్లలకి పెళ్లి చెయ్యాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. మీరు కూడా ఫ్యూచర్ లో మీ ఇంట్లో ఆడ పిల్లకి పెళ్లి చెయ్యాలా..? అయితే ఇక మీరేం కంగారు పడాల్సిన పని లేదు.ఇక ఆడపిల్లల పెళ్లి ఖర్చుల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషప్ ఆఫ్ ఇండియా ఒక పాలసీని తీసుకొచ్చింది. ఇక అదే ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ. దీని వలన ఆడపిల్ల వున్న కుటుంబానికి ఆర్ధిక ఇబ్బంది ఉండదు. మరి ఇక ఈ పాలసీ గురించి పూర్తి వివరాల లోకి కనుక వెళితే.. ఏ చింత లేకుండా కూతురికి కన్యాదానం చేసేలా కన్యాదాన్ పాలసీని రూపొందించింది ఎల్ఐసీ కంపెనీ.ఇక కూతురు పెళ్లి సమయానికి లక్షల రూపాయలను మనం పొందొచ్చు. అయితే దీనిలో మనం కొన్ని నెలలు పెట్టుబడి అనేది పెట్టాలి.ఈ కన్యాదాన్ పాలసీలో రోజుకి రూ.150 పెట్టుబడిగా పెడితే నెలకి రూ.4530 అవుతాయి. 


ఇలా మీరు 22 సంవత్సరాల దాకా చెల్లించాల్సి ఉంటుంది. 25 ఏళ్లు పూర్తయిన తర్వాత మీ చేతికి రూ.31 లక్షలు అనేవి వస్తాయి.ఇక మీరు కనుక ఈ పాలసీ కనుక తీసుకోవాలంటే ఆధార్ కార్డు, ఇన్‌కమ్ ప్రూఫ్, ఐడెంటిటీ కార్డు, అడ్రస్ ప్రూఫ్, పాస్‌పోర్టు సైజు ఫోటో ఇంకా అలాగే మీ కూతురి బర్త్ సర్టిఫికేట్‌ అవసరం అవుతాయి. దగ్గర్లోని ఎల్ఐసీ ఆఫీసును లేదా ఎల్ఐసీ ఏజెంట్‌ ద్వారా మీరు ఈ పాలసీ తీసుకోచ్చు.ఇక 18 నుంచి 50 ఏళ్ల మధ్యలో వున్నవారు ఈ పాలసీకి అర్హులు.అయితే మీ కూతురి వయసు కనీసం ఏడాది అయిన ఉండాలి. ఇక ఈ ప్లాన్ 25 ఏళ్ల పాటు అందుబాటులో ఉంటుంది. కానీ ప్రీమియాలు 22 సంవత్సరాలు మాత్రమే చెల్లించాలి. ఒకవేళ ఇన్సూర్డ్ పర్సన్ చనిపోతే కుటుంబానికి వారి రూ.5 లక్షలు వస్తాయి. లేదా యాక్సిడెంట్ కనుక అయితే కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

LIC