పరారీలో ఉన్న ప్రముఖ లిక్కర్‌ వ్యాపారి విజయ్‌ మాల్యా కథ చివరకు క్లైమాక్స్ కు చేరింది. బ్యాంకులకు వేల కోట్లు ఎగనామం పెట్టి లండన్ కు పారిపోయిన విజయ్ మాల్యాను భారత్ కు తిరిగి తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే భారత సర్కార్ బ్రిటన్ కోర్టును నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం ఒప్పించింది. మాల్యా అప్పగింతకు బ్రిటన్ కోర్టు అంగీకారం తెలిపింది. తనను భారత్ కు అప్పగించకూడదని మాల్యా చేసిన ప్రయత్నాలన్నీ పూర్తయ్యాయి. 
 
విజయ్ మాల్యాను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. సీబీఐ, ఈడీ మాల్యాను కస్టడీ కోరే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది. 2016లో భారత్ నుంచి విజయ్ మాల్యా లండన్ కు పారిపోయాడు. ముంబై ఎయిర్ పోర్ట్ నుంచి మాల్యాను ఆర్థర్ రోడ్ జైలుకు తరలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: