హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టింది. ప్రభుత్వ పాఠశాలలు మరియు కళాశాలలు సంవత్సరం చివరి వరకు మూసివేయాలని నిర్ణయించారు. కోవిడ్ -19 కేసులు ఎక్కువగా పెరగడంతో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. హిమాచల్‌ లో, డిసెంబర్ 15 వరకు సిమ్లా, మండి, కాంగ్రా మరియు కులు జిల్లాల్లో రాత్రి 8 నుండి ఉదయం 6 గంటల వరకు రాత్రి కర్ఫ్యూను తిరిగి ప్రవేశపెట్టారు.

రాబోయే మూడు వారాల పాటు బస్సుల్లో ఆక్యుపెన్సీ మరియు ప్రభుత్వ కార్యాలయాలకు హాజరు పరిమితం చేసారు. నవంబర్ 2 న, రాష్ట్రంలోని పాఠశాలలు 9 నుంచి 12 తరగతుల విద్యార్థుల కోసం తిరిగి తెరవడానికి అనుమతించారు. కాని కేసుల పెరుగుదల కారణంగా నవంబర్ 11 నుండి 25 వరకు అవి మూసేస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యా సంస్థలన్నీ డిసెంబర్ 31 వరకు మూసివేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: