వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ రాత్రి పగలు తేడా లేకుండా పెద్ద ఎత్తున విచారణ జరుపుతోంది. ఎలా అయినా ఈ కేసు ఒక కొలిక్కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న కేంద్ర దర్యాప్తు సంస్థ, ఉన్న అన్ని అవకాశాలను వాడుకుంటూ ఎవరి మీద అనుమానం వచ్చిన వారిని విచారణ చేస్తూ ముందుకు వెళుతోంది.
ఇక తాజాగా వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐ విచారణ రాత్రంతా జరిగింది. పులివెందులలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో కొనసాగిన ఈ విచారణలో ఈ కేసులో కీలకమైన వ్యక్తులుగా సీబీఐ భావిస్తున్న వివేకా సన్నిహితుడు ఎర్రగంగిరెడ్డి, వివేకా పిఎ క్రిష్ణా రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లా, కిరణ్ కుమార్ యాదవ్, సునీల్, వివేకా మాజీ డ్రైవర్ ప్రసాద్ లు కూడా విచారణకు హాజరయ్యారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి