నేటి కాలంలో ఆదాయానికి మించిన ఖర్చుల భారం మరియు ఇతర వ్యక్తిగత సమస్యల కారణంగా సామాన్యుడు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడు. తనకు నచ్చిన వస్తువులను, ఇంట్లోకి అవసరం అయిన ఎలక్ట్ర్టానిక్ పరికరాలను ఒకేసారి డబ్బులు పెట్టి కొనుగోలు చేయడానికి కుదరడం లేదు. అందుకే నష్టం అయినా, కష్టం అయినా మార్కెట్ లో అందుబాటులో ఉన్న వివిధ ఈఎంఐ కంపెనీలపై ఆధారపడుతున్నారు. మనము ఏ వస్తవును కొనుగోలు చేయాలన్నా ఆ వస్తువు విలువ ప్రకారం నెల నెలా ఈఎంఐ చెల్లించి ఆ వస్తువును సొంతం చేసుకునే సౌలభ్యాన్ని తీసుకువచ్చారు. దీనితో సులభంగా ఉంది కదా అని ఒకవేళ డబ్బు చేతిలో ఉన్న కూడా ఈఎంఐ ల ద్వారా కొనుగోలు చేయడానికి అలవాటు పడిపోయారు.

చేతిలో ఉన్న ఫోన్ నుండి కార్ వరకు అన్నింటినీ ఈఎంఐ లద్వారానే తీసుకుంటున్నారు. అయితే ఈఎంఐ ని నెల నెలా కరెక్ట్ గా చెల్లించే వారికి మాత్రం అంత ఎటువంటి ఇబ్బంది ఉండబోదు. కానీ కొందరు అయితే ఈఎంఐ ని చాలా ఈజీ గా స్కిప్ చేసేస్తూ ఉంటారు. అలాంటి వారికి ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి అన్నది ఇపుడు చూద్దాం.

ఈఎంఐ ను కేటాయించిన తేదీ ప్రకారం కట్టాలి. అలా కట్టని యెడల సదరు ఈఎంఐ కంపెనీ జరిమానా విదిస్తుంది. ఇది మీరు కట్టాల్సిన ఈఎంఐ పైన 1 శాతం లేదా 2 శాతం గా ఉంటుంది. మాములుగా ఈఎంఐ ని మూడు నెలలు వరుసగా కనుక చెల్లించకపోతే దీనికి సంబంధిత బ్యాంకులు మాత్రమే జరిమానాలు విధిస్తాయి. ఒకవేళ అలా కాకుండా  అంతకు మించి ఎక్కువ ఆలస్యంగా ఈఎంఐ లు చెల్లించకపోతే వారిని బ్యాంకు నోటీసులు పంపడం లాంటి లీగల్ విధానాల ద్వారా రికవరీ చేస్తారు. ఇంతవరకు వెళితే మీ మీద మళ్ళీ లోన్ లు రావడం జరుగదు. అందుకే తీసుకున్న లోన్ ను క్రమం తప్పకుండా ఈఎంఐ లు చెల్లించి అదనంగా పడే జరిమానాలు నుండి మినహాయింపు పొందండి.  

మరింత సమాచారం తెలుసుకోండి: