కావాల్సిన ప‌దార్థాలు: 
దొండకాయలు - అర కేజి
ధనియాలు - ఒక టీ స్పూన్‌
మెంతులు - అర‌ టీ స్పూను
బ్రౌన్‌ షుగర్ - ఒక‌ టేబుల్‌ స్పూన్‌

 

వేరుశనగపప్పు పొడి - అరకప్పు
కారం - ఇక టీ స్పూన్‌
టమోటాలు - రెండు

 

కరివేపాకు - రెండు రెబ్బలు
కొత్తిమీర - కొద్దిగా
ఆమ్‌చూర్‌ పొడి - అర టీ స్పూన్‌
జీలకర్ర - ఒక‌ టీ స్పూన్‌

 

బిర్యాని ఆకు - ఒక‌టి
లవంగాలు - రెండు
నువ్వులు - ఒక టీ స్పూన్‌
గసగసాలు - ఒక టీ స్పూన్‌

 

తయారీ విధానం: ముందుగా స్టౌ మీద పాన్ పెట్టుకుని నువ్వులు, గసగసాలు కలిపి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మిగతా మసాల దినుసులను కూడా ఒక్కోటి వేగించి పొడిచేయాలి. మ‌రోవైపు దొండకాయల్ని నిలువుగా రెండు ముక్కలుగా క‌ట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని నూనెలో దోరగా వేగించాలి. త‌ర్వాత స్టౌ మీద పాన్ పెట్టుకుని ఒక‌ టేబుల్‌స్పూన్‌ నూనె వేసి కరివేపాకు, టమోటాలు వేగాక కారం, మసాలపొడి దొండముక్కలు కలపాలి. 

 

ఇప్పుడు నువ్వులు, గసగసాలపొడి, బ్రౌన్‌షుగర్‌, ఆమ్‌చూర్‌పొడి వేసి రెండు నిమిషాల తర్వాత కప్పు నీరు, ఉప్పు కలిపి మూతపెట్టాలి. ప‌ది నిమిషాల తర్వాత వేగించుకుని పొడి చేసుకున్న వేరుశనగపొడి, మరో పావు కప్పు నీరు, కొత్తిమీర చల్లి ఉడికించాలి. నీరు ఆవిరయ్యేవరకు ఉంచి స్టౌ ఆఫ్ చేస్తే స‌రిపోతుంది. అంటే టేస్టీ టేస్టీ దొండ‌కాయ మ‌సాలా కూర రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: