దేశంలో రోజురోజుకు క్రైమ్ రేట్ పెరిగిపోతుంది. ఇక నేటి సమాజంలో చాలా మంది క్షణికావేశంతో హత్యలకు, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సొంతవారు అని కూడా చూడకూండా విచక్షణ రహితంగా హత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా వదిన మరదలి మధ్య గొడవ ఆ ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఇక వదినను బండరాయితో కొట్టిచంపిన మరదలు.. ఆపై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మండ్య తాలూకాలోని కంబదహళ్లి గ్రామంలో చోటు చేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మండ్య తాలూకాలోని కంబదహళ్లి గ్రామంలో గిరీష్‌ అతడి భార్య ప్రియాంక జీవనం సాగిస్తున్నారు. అయితే . ప్రియాంకకు రెండు సార్లు గర్భం నిలిచినట్లే నిలిచి అబార్షన్‌ జరిగింది. ఇక ఇటీవల ప్రియాంక మళ్లీ గర్భం దాల్చడంతో భార్యభర్తలు కలిసి మండ్యలో ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవడనికి వెళ్ళి ఇంటికి వచ్చారు. అయితే గిరీష్‌ గీతా బెంగళూరులో ఉండేది,

దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో గీతా భర్తకు కరోనా వైరస్ సోకింది  గీతా భర్త చనిపోవడంతో ఆమె  రెండు నెలలుగా వచ్చి గిరీష్‌ వద్ద ఉంటోంది. ఇక ఆసుపత్రి నుండి ఇంటికి తిరిగి వచ్చిన ప్రియాంకకు, గీతా మధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. దీంతో ప్రియాంక నేను ఎక్కడ ఉండనని పుట్టింటికి వెళ్తానని గదిలోకి వెళ్లి బట్టలు సర్దుకుంటుంది. క్షణికావేశానికి గురైన గీతా వెనక నుండి  బండరాయి తీసుకొని వచ్చి వదిన తలపైన గట్టిగా కొట్టింది.

దీంతో తీవ్ర గాయమై కింద పడిపోయిన ప్రియాంక అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. వదిన చనిపోవడంతో భయపడిన  గీత మరో గదిలోకి వెళ్లి చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక కొంతసేపటికి ఇంట్లోనివారు, ఇరుగుపొరుగు గమనించి బసరాలు పీఎస్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టు నిమిత్తం మండ్య ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: