ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో తృతీయ పార్టీగా నిలుస్తుందనుకుంటున్న జనసేన తెదేపాతో పొత్తుకు ఉవ్విళ్లూరుతుంది. క్రితం సారి 57 సీట్లలో ప్రభావవంతమైన ఓట్లు జనసేనకు ఓట్లు వచ్చాయి. జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే తెదేపాతో పొత్తు పెట్టుకుని గతంలో వచ్చిన ఓట్లను బేరిజు వేసుకొని ఆయా నియోజకవర్గాలపై పవన్ కల్యాణ్ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు. ఈ 57 సీట్లను జనసేనకు ఇస్తే తెదేపాతో జోడి కట్టడానికి పవన్ కల్యాణ్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.


శ్రీకాకుళం నియోజకవర్గంలో  7557 ఓట్లు జనసేనకు వచ్చాయి. ఇంతే తేడాతో అక్కడ వైసీపీ అభ్యర్థి గెలిచారు. జనసేనకు వచ్చిన ఓట్ల వల్ల అక్కడ వైసీపీ గెలిచింది. కాబట్టి ఈ సారి అలా జరగకుండా టీడీపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీని ఈజీగా ఓడించగలమనే నమ్మకంతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది.


2019 సాధారణ ఎన్నికల్లో జనసేన పట్టు సాధించిన నియోజకవర్గాలు ఇవే విజయనగరం, భీమిలి, గాజువాక, అనకాపల్లి, యలమంచిలి, పత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, రామచంద్రపురం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గంగావరం, నిడదవోలు, కొత్తపేట,ఆచంట, నర్సాపురం, భీమవరం, తణుకు, తాడెపల్లిగూడెం, ఏలూరు, కైకలూరు, పెడన, మచిలిపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ వెస్ట్ , విజయవాడ సెంట్రల్, తాడికొండ, పొన్నూరు, వేమూరు, తెనాలి, పత్తిపాడు, నెల్లూరు సిటీ, నగిరి, తిరుపతి, కర్నూలు సిటీ, ఆదోనిలో జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.


అందులో జనసేనకు 20 వేల నుంచి 30 వేల ఓట్లు వరకు వచ్చిన 18 నుంచి 20 స్థానాల్లో కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో పవన్ కల్యాణ్ ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మూడో పార్టీగా ప్రజల్లోకి వెళ్లి ఒంటరిగా పోటీ చేసి పవన్ సీఎం అవుతడనుకునే జనసేన కార్యకర్తలకు, అభిమానులకు ఇలాంటి విషయాలు మింగుడు పడనివే. ఇప్పటికైతే జనసేన ఇలా ఆలోచిస్తోంది. రాబోయే రోజుల్లో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో జనసేన టీడీపీ పొత్తు కుదురుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: