కరోనా సమయంలో చాలామంది నిరాశ్రయులయ్యారు. ఉద్యోగం లేని వారు ఇంకా దీని స్థితికి చేరుకోగా, ఉద్యోగం ఉన్న వారు పని లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. మరి కొన్ని కారణాల చేత వారి ఉద్యోగాలను సైతం వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం కరోనా ముగిసిన తరువాత తిరిగి  నిరుద్యోగులకు వూరట ను ఇచ్చేందుకు  ప్రభుత్వం..రంగం సిద్ధం చేస్తోంది.  నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉద్యోగం త్వరలోనే మీ ముందుకు రాబోతోంది..

ప్రభుత్వ రంగంలో పనిచేయాలనుకునే వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. కరోనా సమయం తరువాత నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ లాంటిది. NTPC ( NATIONAL THERMAL POWER CORPORATION LIMETED) వారు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ కెమిస్ట్రీ విభాగంలో మొత్తం 230 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది.

ఈ ఉద్యోగాలపై ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 24 నుంచి మార్చి 10 లోగా అప్లై చేసుకోవాలి. ఇందులో అసిస్టెంట్ ఇంజనీర్  (AE) పోస్ట్ లు 200, అసిస్టెంట్ కెమిస్ట్రీ  విభాగంలో 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

విద్యార్హతలు:
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రానికల్/ మెకానికల్/ ఎలక్ట్రానిక్ / ఇన్స్ట్రుమెంటేషన్ విభాగాలలో పనిచేసిన వారు ఉద్యోగాలకు అర్హులు. అంతేకాకుండా సంబంధిత విభాగంలో  అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.

ASSISTANT CHEMIST  విభాగంలో పోస్టులకు అప్లై చేయాలనుకునేవారు 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమిస్ట్రీ చేసి ఉండాలి. అదే విధంగా ఏడాది అనుభవం కలిగి ఉండాలి.

ఈ ఉద్యోగాలకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.https://www.ntpc.co.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను సులభంగా తెలుసుకోవచ్చు.

తక్కువ సంఖ్యలో ఖాళీలు ఉన్న నేపథ్యంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి  భారీ జీతం  లభించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: