నేటి రోజుల్లో చదువులన్నీ బట్టీ పట్టి చదివే చదువులే. బాగా చదువుతారు.. పెద్ద పెద్ద ర్యాంకులు కూడా తెచ్చుకుంటారు.. చదవడం కోసం పెద్ద పెద్ద కాలేజీలను కూడా ఎంచుకుంటారు.. అయితే చదువులు పూర్తయిన తర్వాత మాత్రం ఉద్యోగం సంపాదించ లేక చివరికి నిరుద్యోగులు గానే మిగిలిపోతారు. దీనికి కారణం ఉన్నత చదువులు చదివినప్పటికీ కనీసం నాలెడ్జ్ లేకపోవడమే. నేటి రోజుల్లో మార్కుల కోసం పరుగులు పెడుతున్నారు తప్ప నాలెడ్జ్ కోసం చదువటం లేదు. వారు చదువుతున్నది ఏమిటి అన్నది కూడా విద్యార్థులకు కాస్తయినా అవగాహన ఉండటం లేదు. ఎంతో సులభ రీతిని వెతకడం ఇక ఆ తర్వాత చదివి బట్టీపట్టి ఇక ఉన్నది ఉన్నట్లుగా పరీక్షల్లో రాసి మంచి మార్కులు సాధించడం మాత్రమే జరుగుతుంది.
ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రస్తుత రోజుల్లో డిగ్రీ చదవడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. ఒకప్పుడు డిగ్రీ అంటే ఎంతో ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం డిగ్రీ చదివితే ఏం ఉపయోగం లేదు అని ఇతర కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు అయితే కేవలం డిగ్రీ మాత్రమే కాదు అటు ఇంజినీరింగ్ లాంటి కోర్సులలో కూడా బట్టి చదువులు తప్ప విద్యార్థుల్లో నాలెడ్జ్ మాత్రం పెరగడం లేదు అని అంటున్నారు విశ్లేషకులు. ఇలా ప్రస్తుతం ఎంతో మంది డిగ్రీలు బీటెక్ ఎంబీఏ పూర్తి చేసినప్పటికీ అందరూ అక్షరాస్యులుగా మారుతూ ఉన్నప్పటికీ వందకి తొంభై తొమ్మిది మందికి వారు చదివిన చదువు పై కనీస విజ్ఞానం లేకుండా పోతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ చదువుల తీరు మారితేనే సమాజం బాగుపడుతుంది అంటున్నారు విశ్లేషకులు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి