గత ఏడాది నుంచి రైల్వే లో ఉద్యోగాల కోసం ఎందరో వెయిట్ చేస్తూ ఉంటారు. నోటిఫికేషన్ ను ఇటీవల విడుదల చేశారు. వాటిలో ఎలాగైనా జాబ్ కొట్టాలని  ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు కేంద్రం షాక్ ఇచ్చింది.గ్రూప్ డి పరీక్ష మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్ష ఏప్రిల్, జూన్ మధ్య జరిగాల్సి ఉంది. కానీ దేశంలో కరోనా ఉధృతి నేపథ్యంలో వాయిదా పడుతూ వస్తోంది. ఆర్‌ఆర్‌బి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరి (ఎన్‌టిపిసి) పరీక్షలు ముగిసిన తరువాతే ఆర్‌ఆర్‌సీ గ్రూప్ డి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.


కానీ,  ఎన్‌టిపిసి పరీక్షలు ఇంకా పూర్తికాలేదు. దీని ప్రభావం గ్రూప్ డి పరీక్షలపై పడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి మరింత ఆలస్యం కానున్నాయి. కరోనా కారణంగా ఎన్టీపీసీ 7వ బ్యాచ్కు పరీక్షలను నిర్వహించలేదు. ఇప్పటి వరకు 6 బ్యాచ్లకు కరోనా నిబంధనలు పాటిస్తూ ఆర్ఆర్బీ పరీక్షలు నిర్వహిస్తూ వస్తోంది.. అందుకు కారణాలను అడిగితే మాత్రం కరోనా అంటూ చాటేస్తుంది. ఇక ఇప్పుడు మాత్రం పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.7వ బ్యాచ్కు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇంకా ఖరారు కాలేదు. దీంతో కరోనా ప్రభావం తగ్గేవరకు ఈ పరీక్షకు కొంతకాలం బ్రేక్ పడనుంది.


ఆర్‌ఆర్‌సి గ్రూప్ డి మొదటి దశ ప్రక్రియ 2021 ఏప్రిల్‌లో ప్రారంభమవుతుందని డిసెంబరులో రైల్వే అధికారులు తెలిపారు. కానీ, దేశంలో కరోనా ఉదృతి దృష్ట్యా చాలా నియామక సంస్థలు పరీక్షలను రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో గ్రూప్ డి పరీక్షలను కూడా నిర్వహించలేని పరిస్థితి తలెత్తింది. గ్రూప్ డి పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సంబంధిత జోనల్ వెబ్‌సైట్లలో వారి పరీక్ష తేదీకి సంబంధించిన అప్డేట్స్ను తనిఖీ చేసుకోవచ్చని ఆర్ఆర్బీ తెలిపింది... కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఆర్‌ఆర్‌సి గ్రూప్ డి కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఈ పరీక్షను మొత్తం మూడు దశల్లో నిర్వహిస్తారు. ముందు కంప్యూటర్ బేస్ట్ టెస్ట్ నిర్వహిస్తారు. దీంట్లో ఉత్తీర్ణత పొందిన వారికి శారీరక సామర్థ్య పరీక్ష నిర్వహిస్తారు. అందులోనూ ఉత్తీర్ణత సాధించిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహిస్తారు. ఇవన్నీ పూర్తి చేసుకున్న వారికి జాబ్ ఆఫర్ లెటర్ ను ఇవ్వనున్నట్లు తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: