మన దేశంలో అత్యధికంగా అక్షరాస్యత రేటు కలిగి ఉన్న రాష్ట్రం అనగానే చాలామందికి గుర్తుకు వచ్చేది కేరళ. అలాంటి కేరళ ను ఈసారి  మన హైదరాబాద్ జోన్ విద్యార్థులు  కాస్త వెనక్కి నెట్టారు. జేఈఈ అడ్వాన్స్డ్ ఎంట్రన్స్ టెస్టు లో చాలామంది అర్హత సాధించడంతో హైదరాబాద్ జోన్ కి సంబంధించిన విద్యార్థులు  వివిధ ఐఐటీ లలో సీట్లు పొందారు. ముఖ్యంగా ఈ ఐఐటీ,  ఐఐఐటీ, ఎన్ఐటి సంస్థలు  కేంద్ర ప్రభుత్వ సహకారంతో అద్భుతంగా నడుస్తాయి.  అయితే ఈ సీట్ల భర్తీ కోసం  జాయింట్ సీట్ అలికేషన్ అథారిటీ నిర్వహించిన కౌన్సిలింగ్ ప్రక్రియ జూలై లోనే పూర్తయిపోయింది. 

ఇదే తరుణం లో జేఈఈ అడ్వాన్స్డ్ 2025 పై  ఐఐటి కాన్పూర్ తాజాగా ఒక నివేదిక ను విడుదల చేసింది. అయితే ప్రతి ఏడాది ఐఐటీ లో సీట్లు పొందుతున్న వారిలో అమ్మాయిలు ఎక్కువగా ఉంటున్నారని, ఈ ఏడాది కూడా అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.  2023లో 3,422 మంది సీట్లు పొందితే, 2024లో 3,495, 2025 లో 3,664 మంది సీట్లు పొందారని ఆ నివేదికలో తెలియజేశారు.. అయితే ఈ ఎంట్రెన్స్ టెస్ట్ లో టాప్ 100 ర్యాంకు సాధించిన విద్యార్థుల్లో  ఎక్కువమంది బొంబాయి, మద్రాస్, ఢిల్లీ ఐఐటీలకి ప్రిఫరెన్స్ ఇచ్చి అందులోనే చేరారు.

ఇక ఇదే తరుణంలో  దేశంలో అత్యంత ఐఐటీ సీట్లు సాధించిన వారిలో తెలంగాణలోని హైదరాబాద్ జోన్ విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్ జోన్ విద్యార్థుల్లో 4,363 మంది సీట్లు సాధించారు. ఢిల్లీకి సంబంధించిన విద్యార్థులు 4,182 మంది, బాంబే విద్యార్థులు 3,825 మంది, కారగ్ పూర్ నుంచి  1,655, ఇక చివరి స్థానంలో గుహవాటి 812 మంది విద్యార్థులు  అర్హత సాధించారు. వీరందరి కంటే అత్యధికంగా హైదరాబాద్ జోన్ విద్యార్థులే  ఐఐటిలో సత్తా చాటారని తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: