చర్మం పొడిబారుతుంది: ప్రస్తుతం చాలా మంది చర్మం పొడిబారడం వంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అయితే ఇందుకు ప్రధాన కారణం శరీరం లో తగిన నీటి శాతం లేకపోవడమేనట. అందుకే నీటిని ఎక్కువగా తాగాలి. అలాగే ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి.
లిప్స్ క్రస్టింగ్: పెదవులు కూడా బాగా పొడిబారుతుంటాయి. స్కాబ్లింగ్ కూడా డీహైడ్రేషన్ చర్మం యొక్క లక్షణం అని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై దురద,పగుళ్లు వంటివి కూడా దీని వలనే వస్తాయట. అంతేకాదు వయసు పెరిగే సమయం లో చర్మ కాంతి తగ్గడం, ముడతలు వంటివి కూడా శరీరం లోని నీటి కొరత వలనే తలెత్తుతాయి అని నిపుణులు చెబుతున్నారు. అందుకే శరీరానికి తగిన నీటిని అందించాలి. పండ్లు ఎక్కువగా తినడం కూడా శరీరం లో నీటి శాతాన్ని పెంచుతాయి . ఇలా మీరు శరీరానికి తగిన నీటిని అందించగలిగితే మీ చర్మంపై ప్రకాశవంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.