ప్రతి ఒక్కరికి ఎక్కడైనా దొరికేటువంటి ఆకుకూరలలో బచ్చలి కూర కూడా ఒకటి. వీటిని పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు.బచ్చల కూరలో బోలెడన్ని పోషకాలు కూడా ఉన్నాయి. బచ్చలి కూరను వేపుడు చేసుకోవచ్చు..లేదంటే పప్పులో కూడా వేసుకోవచ్చు. అయితే ఇప్పుడు బచ్చలు కూర వల్ల పలు ప్రయోజనాలను తెలుసుకుందాం.


1). ముఖ్యంగా బచ్చలి కూర శరీరానికి దివ్య ఔషధంలా పనిచేస్తుంది. రక్తహీనతో బాధపడే వారికి ఈ బచ్చలి ఆకు కూర బాగా పనిచేస్తుందని నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్నవారికి ఈ బచ్చలి కూర తీసుకోవడం వల్ల వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

2). హైబీపీ సమస్యతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ ఆకుకూరను తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుందట. బచ్చలి ఆకుకూరలోని రసం కూడా తాగితే రక్తపోటు అదుపులో ఉంచుకోవచ్చు. ఈ బచ్చలు కూర గుండెపోటు ప్రమాదాన్ని నివారిస్తుంది.


3). ప్రతిరోజు బచ్చలి ఆకు ను ప్రతిరోజు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు పదార్థాలను సైతం కరిగిస్తుంది. ఇందులో ఒమేగా-3 ఆమ్లాలు ,సెలీనియం అధికంగా ఉంటుంది. ఇది నరాల బలహీనత ఉండే వారికి, నీరసంగ ఉండేవారికి ఈ బచ్చలి కూర చాలా ఉపయోగపడుతుంది. ఇక అంతే కాకుండా మెదడు ఆరోగ్యంగా ఉండడానికి ఈ బచ్చలి కూర చాలా సహాయపడుతుంది.


4). మూత్రంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు ప్రతిరోజు ఈ బచ్చలి కూరను తీసుకోవాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఈ బచ్చలి కూరను తినడం వల్ల మలమూత్ర విసర్జనలో ఎలాంటి సమస్యలు ఉన్నా తొలగిపోతాయి. అంతేకాకుండా కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలకు ఇబ్బంది పడేవారు ఈ ఆకులు తరుచూ తినడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు.


అయితే ఈ బచ్చలి కూరలో పప్పు దినుసులు కలుపుకొని ఫ్రై చేసుకుని తినడం వల్ల మరిన్ని పోషకాలు లభిస్తాయని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: