కొంతమంది ప్రజలు ఏదైనా ఫంక్షన్ జరిగిన, ఫెస్టివల్ జరిగిన ఈ మధ్యకాలంలో పలు పార్టీలు అంటు ఎక్కువగా మధ్యాన్ని సేవిస్తూ ఉన్నారు. మద్యం తాగడం అనేది చాలా ప్రమాదకరం ఏటా మద్యానికి బానిస అయిన వారు క్యాన్సర్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇక ఇవే కాకుండా వివిధ రకాల వ్యాధులు సంభవించిన వారి సంఖ్య కూడా అంచనాలకు పెరిగిపోతోందని వైద్యులు తెలియజేస్తున్నారు. మద్యం తాగడం వల్ల శారీరక సమస్యలే కాకుండా మానసిక సమస్యలు, బాగోద్వేగా సమస్యలు కూడా తలెత్తుతున్నాయని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే సడన్గా మద్యాన్ని మానేయడం వల్ల తీవ్రమైన పరిణామాలు ఏర్పడతాయట వాటి గురించి తెలుసుకుందాం.



మద్యానికి బానిస అయిన వారు  మానేయడం అంత సులువ కాదట. నిత్యం మద్యానికి బానిసైన వారు సడన్గా మద్యాన్ని మానివేస్తే..అది మానివేసిన వారి శారీరక మానసిక ఆరోగ్యం పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుందని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే అలా సడన్గా ఆల్కహాల్ మానేస్తే సిండ్రోస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ వ్యాధి బారిన పడ్డవారు తేలికపాటి ఆందోళన మరియు అలసట నుండి వికారం వరకు మన శరీరంలో పలు లక్షణాలు కనువిప్పిస్తాయట.

సడన్గా ఆల్కహాల్ ని ఉపసంహరించుకున్న వారు వాంతులు, తలనొప్పి, గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, గందరగోళం ,హై బీపీ వంటివి వస్తాయని నిపుణులు తెలియజేస్తున్నారు. ఎక్కువగా మద్యపానం చేసిన వారు కూడా నాడీ వ్యవస్థ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. ఒక పరిశోధనలు ఇలాంటి లక్షణాలు ఎక్కువగా యువతులలోనే కనిపించినట్లుగా వైద్యులు తెలియజేయడం జరుగుతోంది. అయితే ఇలాంటి లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే వారు వైద్యుల్ని సంప్రదించడం చాలా మంచిది. లేకపోతే తీవ్రమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని వైద్యుల సైతం తెలియజేస్తున్నారు. ఆల్కహాల్ ని పూర్తిగా మానేయాలనుకున్నవారు నెమ్మదిగా మానేయడం చాలా మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి: