ఇక ఆలస్యంగా నిద్రలేవడం వల్ల కూడా మనం అనారోగ్యాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల గుండె సంబంధమైన జబ్బులు వచ్చే అవకాశం 40 శాతం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే మెటబాలిక్ డిసార్డర్స్ అనగా జీవన విధానం సరిగ్గా లేనందున్న వచ్చే ఊబకాయం, షుగర్, కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ ఇంకా అలాగే హార్మోన్ల అసమతుల్యత వంటి చాలా రకాల జబ్బుల బారిన పడే అవకాశం ఉందట.ఇక ఇటువంటి అనారోగ్య సమస్యల బారిన పడి వయసు పైబడకుండానే త్వరగా మరణిస్తున్నారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మానసికపరమైన సమస్యలు వచ్చే అవకాశం ఏకంగా 30 శాతం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మానసిక ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్, చిరాకు ఇంకా అలాగే కోపం లాంటి అనేక రకాల మానసిక పరమైన సమస్యలు కూడా తలెత్తుతున్నాయని వారు చెబుతున్నారు.


అదే విధంగా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల శరీరంలో జీవ గడియారం దెబ్బతిని హార్మోన్ల అసమతుల్యత ఇంకా థైరాయిడ్ వంటి భయంకర సమస్యలతో పాటు శరీరంలో జీవక్రియలను అదుపు చేసే హార్మోన్ల పనితీరు కూడా దెబ్బతింటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అదే విధంగా ఆలస్యంగా నిద్రలేవడం వల్ల మెదడులో కణాలు కుచించుకుపోయి మతిమరుపు, ఆల్జీమర్స్ వంటి సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఆలస్యంగా నిద్రలేవడం అనే అలవాటు నుండి సాధ్యమైనంత త్వరగా బయటపడాలని లేదంటే ఖచ్చితంగా చాలా రకాల సమస్యల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంకా అంతేగాక రాత్రి పూట త్వరగా నిద్రించి ఉదయాన్నే త్వరగా నిద్రలేవడం వల్ల రోజంతా కూడా ఉత్సాహంగా ఉండవచ్చని అలాగే దీర్ఘకాలం పాటు ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: