రోజు ఇది తాగితే ఏ జబ్బులు రావు?

జొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఎందుకంటే వీటిలో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు పీచు పదార్థాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మనలో చాలా మంది కూడా ఈ జొన్నలతో రొట్టెలను తయారు చేసుకుని తింటూ ఉంటారు. కేవలం రొట్టెలే కాకుండా ఈ జొన్నలతో మనం ఆరోగ్యకరమైన అంబలిని కూడా తయారు చేసుకుని తాగవచ్చు. జొన్న అంబలిని తాగడం వల్ల రుచితో పాటు సంపూర్ణ ఆరోగ్యాన్ని కూడా చాలా ఈజీగా సొంతం చేసుకోవచ్చు. ఈ జొన్న అంబలిని తయారు చేసుకోవడం కూడా చాలా సులభం. ఈ అంబలిని ఎవరైనా కూడా చాలా తేలికగా తయారు చేసుకోని తాగవచ్చు.ఇది రుచిగా ఉండడంతో మన ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా మేలు చేస్తుంది. ఇక ఈ జొన్న అంబలిని ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే ఈ అంబలిని తాగడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. 


ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోని ఆ తరువాత ఇందులో మూడు గ్లాసుల నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా కలపాలి. అలాగే ఇందులో సైంధవ లవణాన్ని కూడా వేసి కలపాలి. తరువాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మధ్యస్థ మంటపై కలుపుతూ బాగా ఉడికించాలి. ఇక ఈ అంబలిని 8 నుండి 10 నిమిషాల పాటు అలాగే ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తరువాత దీనిని ఒక గ్లాస్ లోకి తీసుకుని అందులో మిరియాల పొడి ఇంకా అలాగే నిమ్మరసం వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల చాలా రుచిగా ఉండే జొన్న అంబలి తయారవుతుంది.దీన్ని రోజు క్రమం తప్పకుండా తాగారంటే ఏ జబ్బులు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: