లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పటికే సౌత్ సంచలనంగా మారింది. ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దకాలం అయిపోతున్నా ఇక్కడ ఆమెకు ఉన్నంత క్రేజ్ మరే హీరోయిన్ కూ లేదంటే అతిశయోక్తి కాదు. మధ్యలో ఆమె కెరీర్ ముగిసిందని అంతా అనుకున్నారు. కానీ గోడకు తన్నిన బంతిలా ఆమె అంతకు ముందుకంటే వేగంగా తిరిగొచ్చేసింది. ఇక అంతే ఆమె వెనక్కి తిరిగి చూసుకోకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది. ఒక్క లేడీ ఓరియెంటెడ్ సినిమాలే కాదు స్టార్ హీరోలతో రొమాన్స్ చేయాలన్నా, దైవత్వానికికైనా, దెయ్యంలా మారాలన్నా దర్శకనిర్మాతలకు నయన్ పేరే గుర్తొచ్చింది. దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ వెలిగిపోతున్న నయన్ ఇప్పటి వరకూ ఒక్క బాలీవుడ్ సినిమాలో కూడా నటించలేదు. ఆమె బాలీవుడ్ ఎంట్రీ గురించి అడపాదడపా వార్తలు వచ్చినప్పటికీ అవి రుమార్లుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా ఈ బ్యూటీబాలీవుడ్ స్టార్ హీరోకు జోడిగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. 

గత కొంతకాలంగా కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఇద్దరి కాంబినేషన్ లో మూవీ ఉంటుందని వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. రాజా రాణి, మెర్సల్, బిగిల్ వంటి చిత్రాలను అందించిన అట్లీ... షారుఖ్ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా పాన్ ఇండియా డైరెక్టర్ గా మారడానికి సిద్ధమయ్యాడు. మరోవైపు షారుఖ్ కూడా చాలాకాలంగా హిట్ లేకుండా ఉన్నాడు. తాజాగా వీరిద్దరి కాంబోలో తెరకెక్కనున్న మూవీలో షారుఖ్ తో నయన్ రొమాన్స్ చేయడం ఖాయమైందని, కేవలం అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి వుందని సమాచారం. ఎస్‌ఆర్‌కె ద్విపాత్రాభినయం చేస్తున్నందున ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మరో బాలీవుడ్ హీరోయిన్ నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ప్రాజెక్ట్ కు సంబంధించి కాస్టింగ్ పూర్తి స్వింగ్‌లో ఉందని, చాలా మంది నటుల కోసం లుక్ టెస్ట్ జరుగుతోందని తెలుస్తోంది. అయితే సౌత్ ఇప్పటికే లేడీ సూపర్ స్టార్ గా ముద్ర వేసుకున్న నయన్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా పనిలో పనిగా పాన్ ఇండియా మూవీ కూడా చేసేస్తుందన్న మాట. సౌత్ లో భారీ రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ నయన్, బాలీవుడ్ లోనే కాక పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటడానికి రెడీ అవుతోందన్న మాట. ఇది తెలిసిన కొంతమంది మాత్రం నయన్ లేడీ సూపర్ స్టార్ పాన్ ఇండియా క్రేజ్ ను దక్కించుకోకుండా వదిలేలా లేదే...!! అని కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: