కొండపొలం న‌వ‌ల ఎంతో పేరు తెచ్చుకున్న స‌న్న‌పు రెడ్డి ర‌చ‌న‌. ఆ న‌వ‌ల‌ను సినిమా గా తీస్తున్నారంటే ఎన్నో మాట‌లు వినిపించాయి. వాటిని వ‌ద్ద‌నుకుంటూ ఈ సినిమాను ఛాలెంజింగ్ గా తీసుకుని కోవిడ్ టైం లో కూడా షూట్ చేశారు. అదేవిధంగా నోవ‌ల్ రైట‌ర్ స‌న్న‌పురెడ్డి తో చ‌ర్చించి, ఆయ‌న‌తోనే క‌థ‌నం రాయించారు. సంభాష‌ణ‌లు క్రిష్, స‌న్న‌పురెడ్డి క‌లిసి రాశారు. ఓ విధంగా ఈ సినిమా మంచి స్థాయిని అందుకునేందుకు అవ‌కాశం ఉన్న సినిమా..అలా అందుకుంటే మేలు..లేదంటే .?
ఫ‌లితం తారుమారు అయ్యే అవ‌కాశం ఉంది. ఏదేమ‌యిన‌ప్ప‌టికీ ఇదో మంచి మ‌లుపు చిత్ర సీమ‌కు..


న‌వ‌ల జోలికి పోకూడ‌దు అని అంటారు. ఎందుకంటే న‌వ‌ల‌ను సినిమా రూపంలో మార్చ‌డం చాలా క‌ష్టం అని కూడా అంటారు. అవును! ఎవ‌రెన్ని అన్న త‌ను రాసుకున్న న‌వ‌ల‌కు ఓ మంచి సినిమా రూపం ఇచ్చాడు వంశీ.. ఆ న‌వ‌ల పేరు మ‌హ‌ల్లో కోకిల.. అదే సితార అనే సినిమాగా మ‌లిచి పేరు తెచ్చుకున్నాడు. హిట్ కొట్టాడు. ఏడిద నాగేశ్వ‌ర‌రావు అనే నిర్మాత‌కు మంచి డ‌బ్బులు అందించాడు. ఇళయ రాజా సంగీతం ఆ సినిమాకు ప్రాణం  పోసింది. అటుపై వంశీ న‌వ‌ల‌ల జోలికి పోలేద‌నే అనుకుంటాను. ఇన్నాళ్ల‌కు న‌వ‌లను సినిమాగా మలిచే ప్ర‌య‌త్నం ఒక‌టి క్రిష్ చేస్తున్నారు. ఈ సినిమా పూర్తిగా డైరెక్ట‌ర్స్ మూవీ అని కూడా అంటున్నారు. పూర్తి బాధ్య‌త‌లు క‌థ విష‌య‌మై కానీ క‌థ‌నం విష‌య‌మై కానీ తానే తీసుకుని, సినిమాను రూపొందించిన విధానం బాగుంద‌ని కూడా అంటున్నారు నెటిజ‌నులు. ఓ మంచి సినిమా చూశామ‌న్న  అనుభూతి ఇచ్చింద‌ని కూడా ప్ర‌శంసిస్తున్నారు.

 
అదేవిధంగా డైరెక్ట‌ర్ వెర్ష‌న్ కూడా చాలా బాగా ఉంద‌ని, పూర్తిగా సినిమాను మ‌లిచిన విధానంలో ఆయ‌న‌కు క‌థ‌పై ఉన్న ప‌ట్టు, దానిని ఆక‌ళింపు చేసుకున్న తీరు  కూడా బాగున్నాయ‌ని అంటున్నారు. ఈ సినిమాతో డైరెక్ట‌ర్ క్రిష్ కు మంచి మార్కులే ప‌డ్డాయి.ముఖ్యంగా ర‌చ‌యిత  చెప్పాల‌నుకున్న భావాల‌ను, భావ‌న‌న‌లను హాయిగా అర్థం అయ్యే రీతిలో ఈ సినిమాను రూపొందించార‌న్న ఆనందం ఒక‌టి చిత్ర ప‌రిశ్ర‌మ నుంచి వ‌స్తోంది. త‌క్కువ బ‌డ్జెట్ లో వికారాబాద్ అడ‌వుల్లో ఈ సినిమాను రూపొందించ‌డం, అందుకు యూనిట్ ప‌డిన శ్ర‌మ ఫ‌లితం ఇవ్వ‌డం ఇవన్నీ ఈ సినిమాను మంచి స్థాయిలో నిలిపాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: