రాజమౌళి కెరీయర్ లోనే మగధీర మూవీ అనేది ఒక ప్రత్యేకం. ఈ మూవీ కోసం అద్భుతమైన గ్రాఫిక్స్ ను ఉపయోగించుకున్నాడు రాజమౌళి. ఈ సినిమా బడ్జెట్ కేవలం 40 కోట్ల రూపాయలు. కానీ ఈ బడ్జెట్ అప్పట్లో చాలా పెద్ద బడ్జెట్ గా చెప్పుకోవడం జరిగింది. అయితే ఈ సినిమా రాజమౌళి అనుకున్న స్థాయిని మించి పోయింది. అయితే ఈ మూవీ రాజమౌళి తాజాగా ఒక విషయాన్ని తెలియజేశారు. వాటి గురించి చూద్దాం.


సినిమా తో రాజమౌళి ఒక మెట్టు పైకి ఎదిగారని అనుకుంటూ ఉంటారు. ఇక మగధీర మూవీలో రామ్ చరణ్ ఇసుక ఊబి లో చిక్కుకుపోయినప్పుడు, అక్కడికి ఒక గుర్రం వచ్చే సహాయం చేస్తుంది. ఈ సన్నివేశం పై రాజమౌళి మాట్లాడుతూ.. చిరంజీవి ఎంతగానో ఇష్టపడే అభిమానుల్లో నేను ఒకరిని అని చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ నటించిన కొదమసింహం సినిమాలో చిరంజీవిని కొంతమంది దుండగులు ఇసుకలో పాతిపెట్టి పోతారు.

అలా పాతిపెట్టిన చిరంజీవికి ఒక గుర్రం వచ్చి సహాయం చేయడం జరుగుతుంది. అయితే ఆ తరువాత చిరంజీవికి, గుర్రానికి మధ్య బంధం సరిగ్గా లేకపోవడంతో తను నిరుత్సాహపడ్డాను అని తెలియజేశారు. అయితే అక్కడ చిరంజీవి ప్రాణాలు కాపాడింది గుర్రం కాదని, ఒక వ్యక్తి ప్రాణాలు కాపాడాడనిపించింది అని చెప్పుకొచ్చారు రాజమౌళి. ఇక ఆ సన్నివేశం రాజమౌళి మైండ్లో అలాగే ఉండిపోయిందట.

ఆ సన్నివేశాన్ని మగధీర సినిమాలో రామ్ చరణ్, గుర్రం తో తన ప్రాణాలను కాపాడి సినిమాకి హైలెట్ గా నిలిచే ల చేసాడు రాజమౌళి. అలా రామ్ చరణ్ ఇసుక ఊబి నుంచి బయటికి రాగానే గుర్రాన్ని హత్తుకోవడం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది అని చెప్పుకొచ్చాడు. చిరంజీవి ఇలాంటి సీన్ చేయలేక పోయినప్పటికీ, ఆ సీన్ ని రామ్ చరణ్ తో చేశానని రాజమౌళి తెలియజేశారు. ఇన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని రాజమౌళి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: