విభిన్నమైన కథను ఎంచుకోవడంలో నాచురల్ స్టార్ నాని కి ఎవరు సాటి రాలేరు అనే చెప్పవచ్చు. ప్రతి సినిమాకి తనదైన శైలిలో వినోదాన్ని ప్రేక్షక అభిమానుల కు అందిస్తారని తెలుస్తుంది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్‌ 'ఈ సినిమా టీజర్ ను నాలుగు భాషల్లో విడుదల చేశారట యూనిట్ బృందం. ఈ టీజర్ మంచి రెస్పాన్స్ అందుకుంటుందని తెలుస్తుంది.ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారట హీరో నాని.

టాక్సీవాలా సినిమా దర్శకుడు అయిన రాహుల్ సాంక్రిట్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'శ్యామ్ సింగ రాయ్‌ ' ఈ చిత్రంలో నానికి జోడిగా సాయి పల్లవి మరియు కృతి శెట్టి అలాగే మడోన్నా సెబాస్టియన్‌ నటిస్తున్నారని తెలుస్తుంది.నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్నారు ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా మిక్కీ J. మేయర్ సంగీతం అందిస్తున్నారని తెలుస్తుంది.ఈ ఏడాది క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24న విడుదల కానుందట ఈ చిత్రం.

టీజర్ విడుదల అయిన సందర్భంగా మీడియా సమావేశంలో పలు ప్రశ్నోత్తరాల కార్యక్రమం నడిచిందని సమాచారం.అందులో భాగంగా విలేఖరులు అడిగిన ప్రశ్నలకు నాని సమాధానం చెప్పారట నాని జెర్సీ చూశాక మీ నటన లో ఇంకొక కోణం ఈ సినిమాలో చూడగలమా టీజర్ చూశాక మీ నటన పై ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది మీరేమంటారు నాని అని అడిగారట.ప్రతి సినిమా ద్వారా ఏదో విషయాన్ని లేదా కొత్త దశను స్టార్ట్ చేయడానికి చేస్తామని కొన్ని కుదురుతాయి అలాగే కొన్ని కుదరవని కానీ ప్రయత్నంలో లోపం ఉండదని ఎపిక్ లవ్ స్టోరీలో 'రాయాలన్న మరియు కాల రాయాలన్నా.అని మొదటి సారి ప్రెస్ చేసి చెప్పినట్టుందే నాని గారు అని అడిగారట.రాయాలన్నా, కాల రాయాలన్నా' ఈ డైలాగ్ మీరు బాగా కనెక్ట్ అయినట్టున్నారు నా పాత్రకు సంబంధించి రైటర్ ఎలిమెంట్ అనేది ఉందని నవ్వుతూ బదులిచ్చారట ఈ ఏడాది క్రిస్మస్ ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారట నాని.

మరింత సమాచారం తెలుసుకోండి: