పవన్ కళ్యాణ్ తన సినిమాలో ఏ పాత్ర చేసినా సరే కాస్త అభిమానులు రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది అనే మాట వాస్తవం. కథ ఏ విధంగా ఉన్నా సరే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మినహా మరో పాత్ర చూడని ఆయన అభిమానులు ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసిన సినిమాలకు సంబంధించి కాస్త ఆసక్తికర అంశాలను బయటపెడుతున్నారు. సినిమాలో కథ కంటే కూడా పవన్ కళ్యాణ్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే దర్శక నిర్మాతలు కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ విషయంలో గతంలో కంటే జాగ్రత్తలు ఎక్కువగా తీసుకుంటున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెండు మూడు సినిమాల్లో నటిస్తున్న సినిమాల తర్వాత ఆయన రాజకీయాల మీద దృష్టి పెట్టే అవకాశం ఉందని 2024 ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ లో అదే విధంగా తెలంగాణలో పర్యటనలు కూడా చేయొచ్చని ప్రచారం మొదలైంది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాలో కాస్త భిన్నం గా కనపడుతున్న నేపథ్యంలో ఈ సినిమా తర్వాత ఆయన చేయబోయే పాత్ర కు సంబంధించి సోషల్ మీడియాలో అనేక వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

ప్రస్తుతం పుష్పా అనే   సినిమాలో అల్లుఅర్జున్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ ఉండగా తన తర్వాత సినిమాలో గోల్డ్ స్మగ్లింగ్ చేసే పాత్రలో పవన్ కళ్యాణ్ కనబడే అవకాశం ఉందని కాస్త అండర్ వరల్డ్ ను కూడా ఈ సినిమాలో టచ్ చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల మీద దృష్టి పెడుతూనే తన సినిమాల షూటింగ్ ని పూర్తి చేసే అవకాశం ఉందని కృష్ణా నగర్ వర్గాలంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా పవన్ కళ్యాణ్ వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు కూడా సినిమాల మీద చాలా ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: