ఇటీవల సిటీ మార్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు దర్శకుడు సంపత్ నంది. ఎన్నో రోజులు వేచి చూసి ఒక మంచి కథను తయారు చేసుకుని ఈ సినిమాను చేయగా ఆయన కష్టానికి ప్రతిఫలంగా విడుదలైన ఈ చిత్రం కు మంచి ఫలితాన్ని వచ్చిందిసంపత్ నందికి. మొదటినుంచి ఆ సినిమాల ద్వారా మాస్ దర్శకుడిగా బాగా ఎలివేట్ అవుతూ వస్తుండగా సిటీ మార్ చిత్రంలో కొన్ని మాస్ సీన్లు ఆయన మార్గదర్శకుడిగా నిలదొక్కుకోవడానికి ఎంతగానో ఉపయోగపడింది అని చెప్పవచ్చు.

తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ దర్శకుల కొరత చాలా ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పుడు సరికొత్త మాస్ దర్శకుడు పుట్టుకురావడం ఒక్కసారిగా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆనంద పడేలా చేసింది. మొదటినుంచి మాస్ ప్రేక్షకులను అలరించే విధంగానే సంపత్ నంది సినిమా చేస్తూ వచ్చాడు. రచ్చ గౌతమ్ నంద బెంగాల్ టైగర్ వంటి చిత్రాలు మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరించగా ఇప్పుడు ఆయన మాస్ ప్రేక్షకులను మరింతగా అలరించే విధంగా ఓ సరికొత్త చిత్రాన్ని చేయనున్నాడు.
 
విక్రమార్కుడు సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నాడు రవితేజ. ఈ చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహించగా విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. అయితే ఇటీవలే విజయేంద్ర ప్రసాద్ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ రెడీ అవుతుందని చెప్పగా దానికి దర్శకుడు గా సంపత్. నంది పేరు బాగా వినపడింది. ఈ నేపథ్యంలోనే ఈ విక్రమార్కుడు 2 అనే సినిమా టైటిల్ తో ఆయన రవితేజ కాకుండా మరో హీరోతో సినిమా చేయనున్నాడట. మరి రవితేజ అభిమానులు దీనికి ఎంత వరకు ఒప్పుకుంటారు అనేది అసలు సమస్య. మరి రాజమౌళి అభిమానులు కూడా దీనికి ఏమని స్పందిస్తారో చూడాలి. వీరి అభిమానులు మాత్రం వీరికి అంత సామాన్యంగా ఒప్పుకునే అవకాశం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: