ఇక పెద్ద ఫ్యామిలీ నుండీ ఎవరైనా హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు అంటే.. వాళ్ళ సినిమాకి సంబంధించి చాలా రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటారు కుటుంబ సభ్యులు అన్నది సంగతి తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేసేలా స్క్రిప్ట్ ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కుటుంబ సభ్యులు చెయ్యి వేయక తప్పదు. ఇక ఈ విషయాలు అన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే.. సూపర్ స్టార్ కృష్ణ మనవడిగా సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడిగా జయదేవ్ గల్లా కొడుకు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు.యువ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో 'హీరో' అనే టైటిల్ తో ఈ చిత్రం రాబోతుంది. సంక్రాంతి పండుగ కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ప్రోమోస్ అన్నీ కూడా ప్రామిసింగ్ గా అనిపిస్తున్నాయి. నిన్ననే ఈ చిత్రానికి సంబంధించి సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవ్వడం జరిగింది.ఎటువంటి కట్స్ అనేవి లేకుండా ఈ సినిమాకి యు/ఎ సర్టిఫికెట్ ను జారీ చేశారు సెన్సార్ వారు. ఇక ఇదిలా ఉండగా.. నిజానికి అశోక్ గల్లా మొదటి చిత్రం 'హీరో' కాదట.

ముందుగా ఓ మంచి ప్రేమ కథతో డెబ్యూ ఇవ్వాలని భావించాడు.అదీ కూడా బడా నిర్మాత దిల్ రాజు బ్యానర్లో..! 'అదే నువ్వు అదే నేను' అనే పేరుతో అశోక్ గల్లా హీరోగా ఓ సినిమా ప్రారంభమైంది. ఆ సినిమాకి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ సినిమా అసలు సెట్స్ పైకి వెళ్ళలేదు.అలాగే అశోక్ కి ఫస్ట్ నుంచి ఈ సినిమా హిట్ అవుతుందని నమ్మకం లేదట. ఈ కథ మీద అనుమానంతో ఆ తర్వాత అశోక్ గల్లాసినిమా నుండీ తప్పుకున్నాడు. దిల్ రాజు వంటి పెద్ద బ్యానర్లో హీరోగా లాంచ్ అయ్యే అవకాశాన్ని వదులుకున్నందుకు అశోక్ గల్లా పై అప్పుడు నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపించాయి.అయితే ఆ సినిమాని 'ఇద్దరి లోకం ఒక్కటే' టైటిల్ తో యంగ్ హీరో రాజ్ తరుణ్ ను హీరోగా పెట్టి కంప్లీట్ చేసాడు నిర్మాత దిల్ రాజు. 2019 డిసెంబర్లో విడుదలైన ఈ సినిమా ప్లాప్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్లను కూడా ఈ సినిమా రాబట్టలేకపోయింది. దీని ఫలితం చూసాక అశోక్ గల్లాసినిమా నుండీ బయటపడడం మంచిదే అయ్యింది అని అంతా అనుకున్నారు. మరి 'హీరో' సినిమాతో అతను ఎలాంటి ఎంట్రీ ఇవ్వబోతున్నాడో చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: