బాలీవుడ్ లో స్టంట్ మాన్ గా కెరీర్ ప్రారంభించి ఇక ఆ తర్వాత హీరోగా అవతారమెత్తాడు అక్షయ్ కుమార్. ఈ క్రమంలోనే తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగాడు. ఇక ఇప్పుడు సూపర్ క్రేజ్ తో దూసుకుపోతున్నాడు అక్షయ్ కుమార్. గత కొంతకాలం నుంచి వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు అక్షయ్ కుమార్. ఇటీవలే సూర్య వంశి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను తెగ ఆకర్షించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం వరుస షూటింగ్లతో బిజీగా ఉన్న హీరో ఇక ఇప్పుడు మరో సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.


 ఇక తాను చేయబోతున్న మరో కొత్త ప్రాజెక్టుకు సంబంధించి సినిమా పేరును సరికొత్తగా ప్రకటించాడు అక్షయ్ కుమార్. అక్షయ్ కుమార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కొత్త సినిమా టైటిల్ 'సెల్ఫీ'. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా ఇమ్రాన్ హస్మి కీలకపాత్రలో నటించబోతున్నాడు. రాజ్ మెహతా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది. సినిమాకు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.


 మాలీవుడ్ లో హిట్ సినిమాగా ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ సినిమాకు హిందీ రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించిన షూటింగ్ త్వరలోనే  పట్టలేక్కపోతుందట. అయితే ఈ సినిమాకు సంబంధించి అక్షయ్ కుమార్ ఇమ్రాన్ హస్మి తమ సోషల్ మీడియా అకౌంట్లో వేరువేరుగా ఒకే యాంగిల్ లో ఫోటో దిగి  పోస్ట్ పెట్టారు చేశారు. ఇలా తాము ఇద్దరం కలిసి సెల్ఫీ సినిమాలో నటించబోతున్నాము అంటూ కాస్త కొత్తగా ప్రకటించారు ఇద్దరు. ఇక ఆ తర్వాత సెల్ఫీ టీజర్ ను కరణ్జోహార్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఇక ఇద్దరు గొప్ప నటులతో కలిసి సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది అంటూ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ పోస్ట్ పెట్టాడు. దీనికి సంబంధించి షూటింగ్ త్వరలో ప్రారంభిస్తాం అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: