అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఐదవ సినిమా ఏజెంట్. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హై యాక్షన్ ఓల్టేజ్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. వరుసగా మూడు సినిమాలు భారీ ఫ్లాప్ లను అందుకున్న అఖిల్ నాలుగవ సినిమా తో హిట్ అందుకున్నాడు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పోయిన ఏడాది దసరాకు విడుదల చేసి తొలి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత ఆయన చేస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీ అంచనాలే ఉన్నాయి అని చెప్పవచ్చు.

సినిమా మొదటి లుక్స్ ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. సిక్స్ ప్యాక్ దేహదారుఢ్యం లో మునుపెన్నడూ కనిపించని విధంగా ఈ సినిమాలో అఖిల్. జ చూపించడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ సినిమా మొదలై కూడా చాలా రోజులు అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ తెలుస్తుంది అనే విషయం తెలుస్తుంది. అయితే తాజాగా ఈ సినిమా అవుట్ పుట్ ను చూసిన నాగార్జున ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాల లో పలు మార్పులు చెప్పాడట.

దాంతో ఈ సినిమా అవుట్ పుట్ విషయంలో నాగార్జున ఏ మాత్రం సంతృప్తిగా లేడనే విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. ఏదేమైనా తొలి విజయం అందుకున్న తర్వాత అఖిల్ మళ్లీ హిట్ కొట్టి ముందుకు వెళ్లాలి కానీ మళ్ళీ ఫ్లాప్ కొడితే ఈ సారి తెరుకోడం కష్టం. మరోవైపు అక్కినేని నాగచైతన్య వరుస విజయాలు సాధిస్తాడు అంతేకాదు ఇండస్ట్రీలో ఉన్న ఇతర హీరోలు కూడా మంచి విజయాలతో ముందుకు పోతున్నారు. ఇంత బ్యాక్ గ్రౌండ్ ఉండి కూడా ఎందుకు అక్కినేని అఖిల్ సరైన విజయం సాధించడం లేదు అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న. ఏదైనా ఇండస్ట్రీలో హిట్స్ కొట్టాలంటే తప్పకుండా అదృష్టం ఉండాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: