సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఒకరు రిజెక్ట్ చేసిన పాత్రలు మరొకరికి వరించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలా దక్కిన రిజెక్టెడ్ పాత్రలే ఎంతోమందికి  ఊహించని రేంజ్ లో గుర్తింపు తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఎంతోమంది ఇతరులను రిజెక్ట్ చేసిన పాత్రలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న వారు ఉన్నారు. అయితే తన కెరియర్ లో కూడా అలాగే ఎదిగాను అంటూ చెబుతోంది బాలీవుడ్ నటి స్వర భాస్కర్. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. నిజ జీవితంలో ఒకలా రీల్ లైఫ్లో ఒకలా ఉంటూ అభిమానుల దృష్టినీ ఎక్కువగా ఆకర్షించారు ఆమె.


 ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలకు కాస్త భిన్నంగానే ఉంటారు. సమాజంలో ప్రతి అంశంపై స్పందిస్తూ తన దైన శైలిలో కామెంట్లు పెడుతూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి పోతారు. కొన్నిసార్లు ఇక ఆమెపై ట్రోలింగ్ లు కూడా వస్తూ ఉంటాయి. ఇకపోతే ఇటీవలే ఓ  ఇంటర్వ్యూలో పాల్గొన్న స్వరభాస్కర్ తన కెరీర్ గురించి తాను చేసిన పాత్రలు గురించి ఆసక్తికర విషయాలు అభిమానులతో పంచుకున్నారు. తన కెరియర్ లో తాను చేసిన పాత్రలు అత్యంత ప్రజాదరణ పొందిన పాత్రలన్ని కూడా ఇతరులు రిజెక్ట్ చేయడం వల్ల నాకు వచ్చినవి అంటూ స్వర భాస్కర్ షాకింగ్ విషయం చెప్పారు.


 రంజానా, ప్రేమ్ రతన్ ధన్ పాయో లాంటి చిత్రాలలో నాకు మంచి పాత్రలు దక్కాయి. అయితే ఆ పాత్రలను మొదటగా వేరే నటీమణులకు ఆఫర్ చేశారు దర్శక నిర్మాతలు.  ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాలో సల్మాన్ ఖాన్ కు చెల్లెలిగా చేయాలని ఎవరూ కోరుకోరు.. అయితే ఎంతో మంది సంప్రదించగా.. ఇక ఈ పాత్ర  రిజెక్ట్ చేయడంతో ఇక చివరికి దర్శకనిర్మాతలు నన్ను సంప్రదించారు.  ఇక ఈ పాత్ర ఒప్పుకొనే టపుడు బాక్సాఫీస్ గురించి ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అన్న విషయం గురించి పెద్దగా ఆలోచించలేదు అంటూ స్వరభాస్కర్ చెప్పుకొచ్చారు. వీరే ది వెడ్డింగ్ సినిమాలో కూడా ఓ పాత్రలో నాకు ఇవ్వాలంటూ రియా కపూర్ సూచించారని  స్వర భాస్కర్ చెప్పుకొచ్చారు. ఇలా ఇతరులు చేసిన పాత్రలతో నాకు మంచి గుర్తింపు వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది స్వర భాస్కర్ ..

మరింత సమాచారం తెలుసుకోండి: