కేవలం రెండు వారాల గ్యాప్ లో వచ్చిన రెండు సౌత్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్ లో సంచలన విజయాలు సాధించాయి. వీటిలో ఇటీవల తెలుగు, కన్నడ సినిమా ఇండస్ట్రీల నుంచి వచ్చి హిందీ మార్కెట్లో అద్భుత వసూళ్లను సాధించిన సినిమాల్లో ఆర్.ఆర్.ఆర్ - కేజీఎఫ్ 2 సినిమాలు ఉన్నాయి.కేవలం ఫస్ట్ వీకెండ్ లోనే 200కోట్లు పైగా వసూళ్లని సాధించి సంచలన విజయం సాధించాయి. కేవలం హిందీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాలు ఫస్ట్ వీకెండ్ లో నే 100 కోట్ల గ్రాస్ వసూలు చేయడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది. క్రైసిస్ తరువాత ఇవి పెద్ద సంచలన విజయాలుగా నమోదయ్యాయి. ఆర్.ఆర్.ఆర్ సినిమా ముందు ఇంకేదీ నిలవలేదు. హిందీ బాక్సాఫీస్ అయితే గడగడలాడింది.మూడు వారాల పాటు ఎదురే లేకుండా ఆర్.ఆర్.ఆర్ సినిమా హవా సాగింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 క్రేజ్ హిందీ బాక్సాఫీస్ వద్ద ఇతర సినిమాల్ని కూడా డామినేట్ చేయడం చర్చనీయాంశమైంది. కొన్ని థియేటర్లలో అదనంగా కుర్చీలు కూడా యాడ్ చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేశారని హిందీ వెబ్ సైట్లు పేర్కొనడం ఆ మూవీ క్రేజ్ ని వెల్లడిస్తోంది.



ఇక ఇప్పట్లో సౌత్ సినిమాని డామినేట్ చేసే సినిమాలు బాలీవుడ్ లో తీయగలరా? అనేంతగా వేవ్ అనేది క్రియేటైంది. అదే క్రమంలో బాలీవుడ్ బాద్షా షారూక్ ఖాన్ చెన్నై ఎక్స్ ప్రెస్ లాంటి మరో ప్రయోగాన్ని సౌత్ డైరెక్టర్ తో కలిసి చేస్తున్నారు. ఇంతలోనే సల్మాన్ భాయ్ కూడా అదే తరహాలో సౌత్ ఇంకా నార్త్ క్రాస్ లవ్ స్టోరీతో సౌత్ ఇంకా నార్త్ బాక్సాఫీసుల్ని జాయింట్ గా కొల్లగొట్టాలని తెగ ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక ఆ దిశగా ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఇక మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ ఇంకా అలాగే అజయ్ దేవగన్ కూడా ఇదే బాటను అనుసరించే వీలుందని కూడా భావిస్తున్నారు.మొత్తానికి ఒకప్పుడు సౌత్ సినిమాలంటే చిన్న చూపు చూసిన నార్త్ వాళ్ళు ఇప్పుడు సౌత్ సినిమాలంటే పడి చచ్చిపోతున్నారు. కంటెంట్ బాగుంటే ఏ సినిమా అయినా బాక్స్ ఆఫిస్ ని ఊచకోత కోయడం ఖాయం అనేంతలా సౌత్ పరిశ్రమ ముందుకు వెళుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: