జీవిత రాజశేఖర్ గతంలో నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టిన జీవిత సినిమాలలో హీరోయిన్ గా నటించి..  ఈమె ఆ తర్వాత దర్శక నిర్మాతగా ఎన్నో చిత్రాలకు పనిచేశారు. ముఖ్యంగా రాజశేఖర్ హీరోగా వస్తున్న శేఖర్ సినిమాకి కూడా దర్శకురాలు ఈమె కావడం గమనార్హం. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇంటర్వ్యూలో పాల్గొన్న జీవిత పలురకాల విషయాలను వెల్లడించింది. శేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ ఇది ఒక కమర్షియల్ సినిమా.. ఈ సినిమాలో రాజశేఖర్ తెల్ల జుట్టుతో మీకు కనిపిస్తారు.. ఇక ఆ గెటప్ ఆ సినిమాకి హీరో అనుకునేలా ఉంటుంది.. కథ బాగా నచ్చడం వల్లే రాజశేఖర్ కూడా ఆ గెటప్ చేయడానికి ఒప్పుకున్నారు.

రాజశేఖర్ ఎప్పుడూ కూడా గ్లామర్ గానే కనిపించాలని అసలు అనుకోరు.  ఆయనకు నచ్చిన పాత్రలు వేస్తారు ఏదో చేద్దాం అన్నట్టు గా మాత్రం ఎప్పుడూ చేయరు. ఒక పెద్ద సినిమాల్లో మంచి విలన్ పాత్ర వచ్చినా కూడా తనకు నచ్చలేదని వదిలేశారు. ముఖ్యంగా కథ పూర్తిగా విన్న తర్వాతనే తనకు నచ్చితేనే ఎస్ అని చెబుతారు. లేకపోతే నో అని చెబుతారు. రాజశేఖర్ తన కథల విషయంలో తన నిర్ణయం తీసుకుంటారు. ఎవరి మాట పట్టించుకోరు.  ఆ తర్వాత ఆయన నో చెప్పడం జరుగుతుంది. ఒకవేళ రాజశేఖర్ కి  కథ నచ్చకపోతే ఆ విషయాన్ని వచ్చిన వాళ్లకు నేనే చెబుతాను. దాంతో బయట వాళ్ళందరూ ఏమనుకుంటారంటే రాజశేఖర్ వరకు ఆవిడ కథ వెళ్ళనివ్వరు.. ఆయనను కథ విననివ్వరు.. అంతా ఆమె చూసుకుంటుంది అంటూ చెప్పుకుంటారు.

నిజానికి రాజశేఖర్ నో అనే మాటను ఆయనతోనే చెప్పించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ అంత అవసరం ఏముంది అని.. నేను అంటున్నాను.  ఇక నా కోసం నేను బ్రతుకుతాను.. కానీ ప్రపంచం కోసం నేను బ్రతకడం ఎప్పుడో మానేసాను. నాకు ఏది కంఫర్ట్ గా అనిపిస్తుందో అదే నేను చేస్తాను.. ఎవరో ఏదో అనుకుంటారని వాళ్లు అనుకున్నట్టుగా బ్రతికే పద్ధతి నాకు లేదు అంటూ ఆమె  చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: