దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా 'ఆర్ ఆర్ ఆర్' ప్రపంచ వ్యాప్తంగా ఎ రేంజ్ విజయాన్ని సాధించిందో మన అందరికీ తెలిసిందే.  మొదటి నుండి భారీ అంచనాలు కలిగి ఉన్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ మార్చి 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యి,  మొదటి షో కే బ్లాక్ బస్టర్ టాక్ ని తెచ్చుకొని ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1100 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టి అదిరిపోయే బ్లాక్ బస్టర్ సినిమాగా నిలిచింది.

ఇలా బాక్సాఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ 'ఓ టి టి' లో విడుదల అయిన తర్వాత కూడా అదే రేంజ్ లో రికార్డ్ లను సృష్టిస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ 'ఓ టి టి' లో విడుదల అయిన తర్వాత కూడా యూఎస్, యూకే లాంటి కొన్ని దేశాల్లో ఇంకా కూడా స్పెషల్ షో లు కూడా రిలీజ్ చేస్తుండగా,  ప్రపంచ వ్యాప్తంగా మరిన్ని దేశాల్లో కూడా  'ఆర్ ఆర్ ఆర్' మూవీ ముందు రోజుల్లో విడుదల కాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి 'ఆర్ ఆర్ ఆర్' మూవీ ని మరో 30 దేశాల్లో విడుదల చేసేందుకు చిత్ర బృందం ప్రణాళికలను వేసుకున్నట్లు తెలుస్తోంది.

మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమాను ఇతర దేశాల్లో విడుదల చేయబోతున్నట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఆలియా భట్ , ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటించగా,  అజయ్ దేవగన్ , శ్రేయ,  సముద్ర కని ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని సమకూర్చగా , డివివి దానయ్య ఈ సినిమాను నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr