టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఈ వారం  అనేక మూవీ లు విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. కానీ ఆ మూవీ లలో ఏ సినిమా కూడా స్టార్ హీరో నటించిన సినిమా కాని, స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించిన కానీ సినిమా లేదు . దానితో ప్రేక్షకులు కూడా ఈ మూవీ లపై మొదటి నుండి కూడా పెద్దగా ఆసక్తి చూపలేదు . 

ఈ వారం విడుదల అయిన మూవీ లలో కాస్తో కూస్తో ప్రేక్షకులు సమ్మతమే , చోర్ బజార్ , కొండా , గ్యాంగ్ స్టార్ గంగరాజు మూవీ లపై కాస్త ఆసక్తి చూపారు. ఇలా ఈ నాలుగు మూవీ లపై ప్రేక్షకులు కాస్త అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ మూవీ లలో కొన్ని సినిమా లకు విమర్శకుల నుండి పర్వాలేదు అనే రేంజ్ ప్రశంసలు దక్కిన ప్పటికీ థియేటర్ లలో మాత్రం ఈ సినిమాలు పెద్దగా ప్రభావం చూపడం లేదు. ఈ వారం విడుదల అయిన మూవీ లలో కాస్తో కూస్తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ ను వసూలు చేస్తున్న సినిమాలు సమ్మతమే ,  చోర్ బజార్ ఈ రెండు సినిమాలే. ఆ తర్వాత కొండా ,  గ్యాంగ్ స్టార్ గంగరాజు సినిమాలు కాస్త ప్రభావం చూపుతాయని విడుదలకు ముందు అనుకున్నప్పటికీ , ఈ రెండు సినిమాలు మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ లను రాబట్టడంలో చాలా వరకు వెనక బడి పోయాయి.

సమ్మతమైన సినిమాలో కిరణ్ అబ్బవరం హీరోగా నటించగా చాందిని చౌదరి హీరోయిన్ గా నటించింది. చోర్ బజార్ సినిమాలో ఆకాష్ పూరి హీరోగా నటించాడు. ప్రస్తుతం ఈ వారం విడుదల అయిన సినిమాలలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రెండు సినిమాలే కాస్తో కూస్తో కలెక్షన్ లను రాబడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: