అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ఏజెంట్. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కుతున్న ఈ సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర లో నటిస్తున్నాడు. తమన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఇప్పటివరకు అయితే ఈ సినిమా విడుదల పై సంశయం వీడలేదు. నిన్నటిదాకా ఈ సినిమా ఆగస్టు లో విడుదల అవుతుందని చెప్పారు కానీ ఇప్పుడు ఆగస్టు లో కావట్లేదు అంటున్నారు. 

ఆగస్టు లో లైగర్ లాంటి భారీ పాన్ ఇండియా సినిమా విడుదల ఉండడం వల్లనే ఈ సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అంటున్నారు. ఏదేమైనా ఇది అక్కినేని అభిమానులను ఎంతో నిరాశ పరుస్తోంది. వరుసగా మూడు ఫ్లాప్ ల తర్వాత నాలుగో సినిమా తో అఖిల్ సాధించిన విజయం ఎవరి ఆకలిని తీర్చలేదు. అలాంటిది మంచి పాజిటివ్ వైబ్స్ కలిగి ఉన్న ఈ సినిమా విడుదల మళ్లీ పోస్ట్ పోన్ అవడం నిజంగా అందరినీ నిరాశ పరిచిన విషయం అనే చెప్పాలి. మరి ఈ సినిమా యొక్క కొత్త విడుదల తేదీ నీ ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. 

ఇకపోతే ఏజెంట్ సినిమా గురించి గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో వస్తున్న పాజిటివిటీ చూస్తుంటే ఈ సినిమాపై అనవసరం గా హైప్ పెంచుతున్నారు అనిపిస్తుంది. వాస్తవానికి అఖిల్ గత సినిమాలకు పెద్దగా హైప్ రావడం, సినిమా ఆ హైప్ కి తగ్గట్లుగా లేకపోవడం వంటివి జరగడం తో ఆయన మూడు సినిమా లు ఫ్లాప్ అయ్యాయని చెప్పొచ్చు. ఇప్పుడిప్పుడే హిట్ బాట పడుతున్న అఖిల్ కు స్టార్ హీరో ఎలివేషన్ ఇవ్వడం ఆయన సినిమా కు ముఖ్యంగా ఆయన కెరీర్ కు ప్రమాదం అని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఏజెంట్ టీజర్ విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకుంటుంది. సినిమా పై ఇది మంచి అంచనాలను పెంచింది అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: