అతిలోక సుందరి శ్రీదేవి' లాగే ఆమె పెద్ద కూతురు 'జాన్వీ కపూర్' కూడా అందాల రాశి. అసలు ఆమె అందాన్ని ఏమని పిలవాలి ?, కుర్రాళ్ల గుండె గదిలో తిష్ఠ వేసిన జాబిల్లి అని పొగడాలా ?, వెండితెర పై రాశులుగా ధారబోసిన అందం అని ప్రశంసించాలా ?, ఇలా ఏమని పిలిచినా 'జాన్వీ కపూర్' అందానికి అది తక్కువే అవుతుంది మరి.


అసలు జాన్వీ కపూర్ హాట్ కంటెంట్ ఎలివేషన్ కి, యూత్ మెంటలెక్కిపోతున్నారంటే అతిశయోక్తి అయితే కాదు.


పైగా 'జాన్వీ కపూర్'లో అందానికి అందం ఉంది, అదేవిధంగా ప్రతిభతో పాటు తెగింపు కూడా ఉంది. ఇప్పటికే, జాన్వీ కపూర్ హిందీ సినీ పరిశ్రమలో నటిగా నిరూపించుకుని తన స్థానాన్ని పదిలం చేసుకున్నది.. కెరీర్ ని జయాపజయాలతో ముడి వేయకుండా తెలివిగా కెరీర్ ను ముందుకు సాగిస్తోంది. ప్రస్తుతం, హిందీలో ఆమె ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో కూడా బిజీ కావడానికి సన్నద్ధం అవుతుంది.


ఈ క్రమంలో 'జాన్వీ కపూర్' తన మనసులో మాటను మొహమాటం లేకుండా బయట పెట్టింది. ఇంతకీ ఈ బాలీవుడ్ బ్యూటీ ఏమి చెప్పింది ?, జాన్వీ కపూర్ మనసులోని మాటలను ఆమె మాటల్లోనే విందాం. 'నాకు దక్షిణాదిలో సినిమాలు చేయాలని ఎంతో ఆసక్తిగా ఉంది. ప్రస్తుతానికి సౌత్ ఇండస్ట్రీ టాప్ గేర్‌లో దూసుకెళ్తుంది. పైగా నేను సౌత్ ఇండియన్ సినిమాలకు, సౌత్ సినిమాల మ్యూజిక్‌కి పెద్ద అభిమానిని' అని కూడా చెప్పుకొచ్చింది.అలాగే 'జాన్వీ కపూర్' తన చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ.. 'నాకు బాగా గుర్తు. నా చిన్నతనంలో మా అమ్మ ఎక్కువగా నాకు సౌత్ మ్యూజిక్ నే వినిపించేది. అందుకే, నాలో సౌత్ మ్యూజిక్ బలంగా నాటుకుపోయింది. అసలు సౌత్ వర్సెస్ నార్త్ అనే చర్చ ఏంటో తనకు అర్థం కావడం లేదని' జాన్వీ పేర్కొందట.


తామంతా దేశం కోసం మాత్రమే సినిమాలు చేస్తున్నామని, ఇదంతా ఒకే దేశమని జాన్వీ కపూర్ కబుర్లు చెప్పుకొచ్చింది. ఇక జాన్వీ కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాన్వీ కపూర్ ప్రస్తుతం అరడజను సినిమాల్లో నటిస్తోందట.. ఇందులో హిందీ చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: