టాలీవుడ్లో అనుష్క శెట్టి అంటే ఒక బ్రాండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఎందుచేత అంటే ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ అనుష్క లాంటి హీరోయిన్ మాత్రం లేదని చెప్పవచ్చు. నటనపరంగా తృప్తి కోరుకునే హీరోయిన్లలో అనుష్క కూడా ఒకరిని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ఒక ఏడాదికి ఎన్నో సినిమాలు చేసి కొన్ని కోట్ల రూపాయలు పారితోషకం తీసుకోగల స్టార్ డమ్ ఉన్న అనుష్క శెట్టి బాహుబలి సినిమా తర్వాత తన కెరియర్ పూర్తిగా మారిపోయింది.



ఇక నెమ్మదిగా సినిమాలు చేసుకుంటూ కొద్దికొద్దిగా సినీ ఇండస్ట్రీకి దూరం అవ్వడానికి ప్రయత్నాలు చేస్తుంది అన్నట్లుగా ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక ఇంస్టాగ్రామ్ లో కూడా పెద్దగా యాక్టివ్గా ఉండదు అనుష్క శెట్టి.. కానీ 5.6 మిలియన్ల ఫాలోవర్స్ కలిగి ఉన్నది సాధారణంగా స్టార్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో ఇతర సెలబ్రిటీలను ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు. కానీ ఈ విషయంలో అనుష్క విభిన్నంగా నిరూపించుకుందని చెప్పవచ్చు అనుష్క ఇంస్టాగ్రామ్ లో 23 మందిని మాత్రమే ఫాలో అవుతోంది అందులో టాలీవుడ్ హీరో ప్రభాస్ మరియు రాన లు మాత్రమే ఉన్నారని చెప్పవచ్చు.


తనకు అత్యంత ఆప్తులుగా రానా మరియు ప్రభాస్ అని అనుష్క కొన్ని ఇంటర్వ్యూలలో తెలియజేయడం జరిగింది. ఇక అనుష్క శెట్టి ఫాలోయింగ్ జాబితా చూస్తే వీరిద్దరూ కూడా అనుష్కకి చాలా స్పెషల్ అనే విషయం తెలిసిపోతుంది. ఇక తెలుగు దర్శకుడు మెహర్ రమేష్ కూడా ఈమె ఫాలో అవుతోంది. ఇక వీరితో పాటు కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీస్ స్పోర్ట్స్ పర్సన్ ను ఇంకా అభిమానులను కూడా ఇవ్వడు ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం యు వి క్రియేషన్ బ్యానర్ పై ఒక సినిమాలో నటిస్తున్నది. ఈ సినిమా షూటింగ్ కూడా చాలా స్లోగా కొనసాగుతూ ఉన్నది. మరి ఈ సినిమా షూటింగ్ అయిపోయిన వెంటనే అనుష్క స్పీడ్ పెంచుతుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: