కొంతమంది సినిమాలలో చేసే కొన్ని కొన్ని పాత్రలు ఎంతగానో అబ్బుతూ ఉంటాయి.  అవి నిజంగా వారికి అసలు పేరు అయితే ఎంత బాగుంటుందో అన్నంతగా ఆ పాత్రలో హీరోలు ఒదిగిపోతూ ఉంటారు. ఆ విధంగా కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ఇటీవలే నటించిన విక్రమ్ సినిమాలోని రోలెక్స్ పాత్రకు ప్రేక్షకులు ఎంతగానో ఫీదా అయిపోయారు. ఆ సినిమాలో ఆయన హీరో కాకపోయినా కూడా చేసింది అతిధి పాత్రే అయినా కూడా ఈ పాత్ర కేవలం ఐదు నిమిషాలే కనిపించిన కూడా ఆ పాత్ర ప్రేక్షకులలో ఎంతగా ముద్ర వేసుకుంది.

 సినిమా వచ్చిన దగ్గరినుంచి ప్రతి ఒక్కరు కూడా ఆ పేరునే జపిస్తూ ఉన్నారు. సూర్య కెరీర్ లోనే ఇది మంచి పాత్ర అని ఆయనను కొనియాడారు. అయితే దీనికి ఇంతటి స్థాయిలో గుర్తింపు రావడానికి కారణం ఆ ఐదు నిమిషాలు దర్శకుడు తీసుకున్న కేర్ అనే చెప్పాలి. ఎంతో అద్భుతంగా ఆయన ఈ సీన్ ను చిత్రీకరించారు. దానికి సూర్య హావభావాలు కూడా తోడవడంతో ఇంతటి స్థాయిలో ఆ పాత్రకు పేరు వచ్చింది. రోలెక్స్ అనే పేరు సోషల్ మీడియాలో ఎంతగా ట్రెండ్ అయ్యిందో అందరికీ తెలిసిందే.

ఆ విధంగా రోలెక్స్ పేరు సూర్యకు ఉండి ఉంటే ఇంకా ఎంత బాగుండేదో అన్న వార్త కూడా బయటకు వస్తుంది. ఇకపోతే ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల కాగా అక్కడ ఈ పాత్రకి ఎక్కువగా గుర్తింపు వస్తుంది. దేశవ్యాప్తంగా ఈ పాత్రను కొనియాడుగుతున్నారు. అప్పటిదాకా సౌత్ వరకు మాత్రమే పరిమితమైన ఈ సినిమా హాట్ స్టార్ లో విడుదల కావడం వల్ల ఇప్పుడు అంతర్జాతీయంగా సినిమా తో పాటు రోలెక్స్ పాత్ర ఫేమస్ అవుతుంది. మరి త్వరలోనే ఈ పాత్ర పేరు మీద పూర్తి స్థాయిలో సినిమాను చేస్తున్న సూర్య అప్పుడు ఎలాంటి సంచలన రికార్డులను చేస్తాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: