ప్రభాస్ హీరోగా పలు చిత్రాలు ఇప్పుడు సెట్స్ మీద ఉన్నప్పటికీ ఎందుకో వాటిని పూర్తి చేయడంలో ఆలస్యం చేస్తున్నాడు ప్రభాస్ఆయన హీరోగా రూపొంది న గత రెండు చిత్రాలు ప్రేక్షకులను ఏమాత్రం ఆలదించలేకపోయాయి. దాంతో ఇప్పుడు చేస్తున్న సినిమాలు తప్పకుండా సక్సెస్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సలార్ చిత్రం పైన ఇప్పుడు అందరూ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కేజీఎఫ్ సినిమా తర్వాత చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలను పెట్టుకున్నారు ప్రతి ఒక్క ప్రభాస్ అభిమాని.

ఆ విధంగా తొందరలోనే ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారంటున్నారు కానీ ఎంతకీ దీనికి సంబంధించిన షూటింగ్ మొదలు కాకపోవడం ఎప్పుడు విడుదలవుతుందన్న సందేహాన్ని వ్యక్తం పరుస్తున్నారు. అయితే గతంలో మారుతితో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు అని ప్రభాస్ అభిమానులు చెప్పారు. ఆ సినిమాను ఈ గ్యాప్ లో చేస్తే ఇంకా బాగుండేదని వారు చెబుతున్నారు. వచ్చే యడాది ఈ సినిమా ను విడుదల చేయబోతున్నాడు ప్రభాస్. 

 ఆ విధంగా ప్రభాస్ ఏ విధంగా తన సినిమాలతో మళ్ళీ కం బ్యాక్ అవుతాడో చూడాలి. పాన్ ఇండియా హీరోగా తనను తాను నిలుపు కోవాల్సిన సమయంలో ప్రభాస్ ఇప్పుడు పెద్ద హిట్ అవసరం ఎంతైనా ఉంది. మరి ప్రభాస్ ఎలాంటి సినిమా తో మంచి కం బ్యాక్ ఇస్తాడో చూడాలి. ఇకపోతే ఇప్పుడు ఒప్పుకున్నా సినిమాలు మాత్రమే కాకుండా అయన మరిన్ని సినిమాలు చేసే విధంగా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. బాలీవుడ్ లో సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే నాగ్ అశ్విన్, సందీప్ రెడ్డి వంగా , మారుతి సినిమాలు పూర్తి చేయని ప్రభాస్సినిమా ను ఎప్పుడు మొదలుపెడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: