టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో సోసియో ఫాంటసీ మూవీగా రూపుదిద్దుకున్న బింబిసార చిత్రం ఆగస్టు 5న అట్టహాసంగా విడుదలై.. తొలి షో నుంచే మంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో కళ్యాణ్ రామ్ ద్విపాత్రాభినయం చేసి తనదైన నటనతో ప్రేక్షకులను బాగా మెప్పిస్తే.. దర్శకుడు వశిష్ట్ మూవీని మంచి విజువల్ వండర్ గా ప్రతి ఫ్రేమ్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించి విమర్శకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు.టాక్ బాగుండటం కంటెంట్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో.. 'బింబిసార' సినిమా బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే వసూళ్లను రాబడుతూ విధ్వంసం సృష్టిస్తోంది. ఇక విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చిత్తు చిత్తు చేసి లాభాల బాట పట్టిన బింబిసార.. ఇప్పటికీ అదే జోరును కంటిన్యూ చేస్తూ స్పీడ్ గా దూసుకుపోతోంది. గత కొంత కాలం నుంచి థియేటర్ల అంశం టాలీవుడ్ ను చాలా అయోమయంలో పడేసి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది.కానీ ఎప్పుడైతే బింబిసార సినిమా విడుదలైందో.. అందరి అనుమానాలు కూడా పటాపంచలు అయ్యాయి.ఇక సరైన కంటెంట్ ఉంటే జనాలు తప్పకుండా థియేటర్ కు వస్తారని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇకపోతే 'బింబిసార' సినిమాకు వస్తోన్న రెస్పాన్స్ చూసి.. హిందీలోనూ ఈ మూవీకి భారీ డిమాండ్ అనేది ఏర్పడింది.


నార్త్ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు 'బింబిసార' సినిమా హిందీలో డబ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారట.అయితే గతంలో కళ్యాణ్ రామ్ 'బింబిసార' సినిమా పాన్ ఇండియా రిలీజ్ గురించి మాట్లాడుతూ.. తెలుగులో మంచి స్పందన దక్కించుకుని సినిమా హిట్టైతే ఆగస్టు మూడో వారంలో హిందీ ఇంకా ఇతర భాషల్లో విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఎలాగో ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ కాదు డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా పరుగులు పెడుతోంది.ఈ నేపథ్యంలోనే మేకర్స్ హిందీతో పాటు ఇతర సౌత్ భాషల్లో కూడా ఈ సినిమాను డబ్ చేసి రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని తాజాగా ఓ టాక్ బయటకు వచ్చింది. మరి ఈ ప్రచారమే నిజమై 'బింబిసార' హిందీలో కనుక విడుదలైతే.. కళ్యాణ్ రామ్ బాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుని సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా అతను కూడా పాన్ ఇండియా హీరో అవ్వడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: