దర్శకుడు హరీష్ శంకర్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు అనే వార్తలు రావడం పట్ల ఆయన అభిమానులు ఎంతగానో సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. దానికి కారణం పవన్ కళ్యాణ్ తో సినిమా ఎప్పుడు జరుగుతుందో తెలియదు కాబట్టి ఆ సినిమా కోసం వేచి చూసే బదులు ఈ హీరోతో సినిమా చేయడానికి ఆయన ముందుకు వెళ్లడమే. మాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరించే సినిమాలు చేసే హరీష్ శంకర్ ఈ చిత్రాన్ని కూడా అదే విధంగా రూపొందిస్తాడని విజయ్ దేవరకొండ అభిమానులు భావిస్తున్నారు.

వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలవ్వడానికి కారణం దిల్ రాజు అనే చెప్పాలి. విజయ్ దేవరకొండ హీరోగా మారిన తర్వాత ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చాడు. దానికి సంబంధించి అడ్వాన్స్ కూడా తీసుకున్నాడు. అయితే కథ సెట్ కాకపోవడంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రావడానికి చాలా సమయం పట్టింది. ఫైనల్ గా దిల్ రాజు హరీష్ శంకర్ తో చెప్పి ఒక మంచి కథను రాయించి విజయ్ దేవరకొండ ను ఒప్పించాడు. ఆ విధంగా ఈ కాంబినేషన్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని చెప్పాలి.

ఇంకొక వైపు దిల్ రాజు మరియు హరీష్ శంకర్ కాంబోలో మంచి సినిమాలే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే హరీష్ శంకర్ ఇతర ప్రొడక్షన్ హౌసులతో సినిమాలు చేస్తూ ఉండడంతో దిల్ రాజుతో సినిమా చేయడానికి చాలా సమయం పట్టిందని చెప్పాలి .చాలా రోజుల తర్వాత వీరిద్దరూ కలిసి ఈ సినిమా చేస్తున్నారని చెప్పాలి. మరి ప్రేక్షకులను అలరించగలిగే సత్తా ఉన్న నిర్మాత అయిన దిల్ రాజు హరీష్ శంకర్ తో కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ఎలాంటి సినిమా చేస్తాడో చూడాలి. లైగర్ సినిమాతో నిరాశగా ఉన్న విజయ్ దేవరకొండ మరొక మాస్ హిట్ తొందరగా కొట్టాల్సిన నేపథ్యంలో ఎంతగానో నమ్మి దిల్ రాజుకు ఈ సినిమా చేస్తున్నాడు మరి ఆ నమ్మకాన్ని దిల్ రాజు హిట్ రూపంలో నిలబెట్టుకుంటాడా అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: