ప్రేక్షకులందరికీ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ మొదలైంది. చూస్తుండగానే ఒక వారం గడిచిపోయింది. ఈ క్రమంలోనే  హౌస్ మొత్తం హాట్ హాట్ గా మారిపోతుంది అనే చెప్పాలి. అయితే ప్రతి సోమవారం అటు నామినేషన్ ప్రక్రియ ఒక యుద్ధంలా జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ నామినేషన్ ప్రక్రియ లో అప్పటివరకు స్నేహితులుగా ఉన్నవారు సైతం ఒకరిపై ఒకరు  సంచలన ఆరోపణలు చేసుకుంటూ నామినేషన్ చేయడం లాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఈ ప్రక్రియ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటుంది.


 ఇక ఈ నామినేషన్ ప్రక్రియ సమయంలోనే రాగద్వేషాలు బయటికి వస్తూ ఉంటాయి. ఒకరినొకరు కసితీరా తిట్టుకుంటారు. మాటా మాటా పెరుగుతూ గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి.  ఇకపోతే రెండవ వారం నామినేషన్ల ప్రక్రియ జరిగింది.  దీంతో ఒకరిపై ఒకరు మనసులో ఉన్న కోపాలను ద్వేషాలను బయట పెట్టేసారు. కామన్ మ్యాన్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి ఆరోహి ల మధ్య మాటల యుద్ధం జరిగింది అని చెప్పాలి.


 ఇప్పటివరకు హౌస్ లో ఉన్న అందరితో కూడా తనకు కాస్త అటాచ్మెంట్ కలిగినట్లు అనిపించింది. కానీ ఆదిరెడ్డి తో మాత్రం తనకు అంతగా అటాచ్ మెంట్ అవ్వలేదు అంటూ ఆరోపణలు చేస్తూ ఆరోహి ఆదిరెడ్డి నీ నామినేట్ చేసింది. ఈ క్రమంలోనే స్పందించిన ఆదిరెడ్డి ఆట ఆడని వాళ్ళని నామినేట్ చేస్తారా లేక పోతే.. నీకు అటాచ్ కాలేదని నామినేట్ చేస్తారా అని అడిగాడు. అయితే ఆట ఆడనీ వాళ్ళని నామినేట్ చేస్తారు అని ఆరోహి అంటుంది. నువ్వు ఎక్కడ ఆడావని ఆదిరెడ్డినీ ఆరోహి ప్రశ్నిస్తుంది. నీ కంటే బాగా ఆడానని ఆదిరెడ్డి అంటాడు.  నాకంటే బాగా ఆడావా అంటూ వెకిలి నవ్వు నవ్వుతుంది ఆరోహి. ఇక నువ్వేం వెలగబెట్టావ్ అంటూ ఆరోహినీ ఆదిరెడ్డి  కూడా దారుణంగా వెక్కిరించాడు. ఇలా ఒక రకంగా ఆదిరెడ్డి ఆరోహి పరువు తీసేసాడు అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: