ఇటీవల రెబల్స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి  మనందరికి తెలిసిందే. ఈయన మరణం తో ప్రభాస్ కుటుంబం లో ఒక్క సరిగా విషాద ఛాయలు అలుముకున్నాయి.అయితే ఇక  ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇకపోతే ఇందులో ఆయన ప్రభాస్ నటించిన ఓ సాంగ్కు డ్యాన్స్ వేస్తూ ఉత్సాహంగా కనిపించారు.అయితే  రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతితో టాలీవుడ్లో తీవ్ర విషాదం నెలకొంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సోమవారం మొయినాబాద్లోని కృష్ణంరాజు ఫామ్ హౌస్లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. 

కాగా హీరో ప్రభాస్ సోదరుడు చేతులమీదుగా ఆయన అంతిమ సంస్కారాలు జరిగాయి.అయితే  ఇక 56 ఏళ్లకు పైగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న కృష్ణంరాజు ఎన్నో గొప్ప సినిమాల్లో నటించారు.ఈయన  కథానాయకుడిగా పరిచయమై.. ఆ తర్వాత పరాజయాల్ని ఎదుర్కొని, ప్రతినాయకుడిగా.. సహాయ నటుడిగా ప్రయాణం సాగిస్తూ మళ్లీ హీరోగా తనని తాను ఆవిష్కరించుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణం ఆయన సొంతం. అయితే ఇక  ఆయన ఇకలేరన్న వార్త అభిమానులను తీవ్రంగా కలిచివేస్తోంది.ఇకపోతే  ఆయన్ను ఇంకా స్మరించుకుంటూ సోషల్మీడియాలో ఆయనకు సంబంధించిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

ఇదిలావుంటే.ఈ క్రమంలోనే తాజాగా కృష్ణంరాజు డాన్స్ వీడియో ఒకటి నెట్టింట సందడి చేస్తూ వైరల్గా మారింది. అయితే  ఇక ఆయన చివరి డ్యాన్స్ ఇదేనంటూ అందులో రాసి ఉంది. కాగా ప్రభాస్ మిర్చి సినిమా ఆడియో ఫంక్షన్లో స్టేజ్పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ కృష్ణంరాజుతో స్టెప్పులేయించారు.ఇకపోతే  కృష్ణంరాజు కూడా ఎంతో ఉత్సాహంగా చిందులేస్తూ కనిపించారు. అయితే ప్రస్తుతం ఆ వీడియోనే వైరల్ అవుతోంది.ఇక కృష్ణంరాజు గారి మరణానంతరం ఆయన కుటుంబ బాధ్యత మొత్తం ప్రభాస్ పైనే పడింది. ముఖ్యంగా కృష్ణంరాజు గారి కూతుళ్లు, ప్రభాస్ చెల్లెళ్ల బాధ్యత కూడా ప్రభాస్ పైనే ఉంది. ఇక నుంచి వాళ్లకు సంబంధించి ప్రతి విషయాన్ని ప్రభాస్ దగ్గరుండి చూసుకోనున్నట్లు తెలుస్తోంది....!!

మరింత సమాచారం తెలుసుకోండి: