దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆయన చిత్రాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో అల రిస్తూ ఉంటాయి. అందుకే ఇప్పటి దాకా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అపజయం ఎరుగని దర్శకుడుగా ఆయన ఉన్నారు. తొలి సినిమా నుంచి మంచి కామెడీ తో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలను చేస్తూ ప్రేక్షకులకు అలరించారు. అలా ఆయన అలాంటి ఎంటర్టైనింగ్ కథలను ఎంచుకున్నాడు కాబట్టే ఆయనకు ఇప్పటిదాకా ఒక ఓటమి కూడా రాలేదని చెప్పాలి.

ఇటీవలే ఎఫ్ 3 సినిమాతో మంచి విజయాన్ని అందుకొని ఇప్పుడు బాలకృష్ణతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. త్వరలోనే వీరిద్దరూ కలిసి ఈ సినిమా యొక్క షూటింగ్ చేయబోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ సినిమా పైన పూర్తి దృష్టి సారించారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా పూర్తయిన తర్వాత అక్టోబర్ నుంచి అనిల్ రావిపూడి దర్శకత్వంలోని సినిమాను మొదలు పెట్టాలని ఆయన భావిస్తున్నాడు.

ఆ విధంగా ఈ ఏడాది రెండు సినిమాలను చేసిన హీరోగా బాలకృష్ణ నిలుస్తాడు. ఏది ఏమైనా నందమూరి బాలకృష్ణ యువ దర్శకులతో సినిమాలను ఎంచుకోవడం నిజంగా ఆయన అభిమానులు ఎంతగానో సంతోషపెడుతుంది. ఈ క్రమంలోనే ఆయనకు ఎలాంటి విజయాలు దక్కుతాయో చూడాలి. ఇక ఈ సినిమా తన గత సినిమాల లాగానే మంచి కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండబోతుంది అని అనిల్ చెబుతున్నాడు. బాలకృష్ణ తరహాలోనే భారీ డైలాగులతో పాటు తన కామిడీ టైమింగ్ కూడా ఏ మాత్రం మిస్ అవ్వకుండా ఈ సినిమాలో అన్ని పొందుపరుస్తానని చెబుతున్నాడు. తొందరలోనే ఈ సినిమా యొక్క టైటిల్ ను రివీల్ చేయనున్నారు. మరి వరుస విజయాలతో ఉన్న బాలకృష్ణ ఈ సినిమాలతో ఎలాంటి విజయం అందుకుంటాడో చూద్దాం. తమన్సినిమా కు సంగీతం అందిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: